Drugs | ఈగల్ టీమ్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన నటి హేమ.. డ్రగ్స్ తీసుకోలేదంటూ వీడియో
Drugs | హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించాయి. కొండాపూర్‌లోని (Kondapur) క్వాక్ ఏరీనా పబ్‌లో (Quake Pub) డ్రగ్స్ సరఫరా జరుగుతున్నదనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది.
Drugs | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించాయి. కొండాపూర్‌లోని (Kondapur) క్వాక్ ఏరీనా పబ్‌లో (Quake Pub) డ్రగ్స్ సరఫరా జరుగుతున్నదనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడున్న 64 మందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో మొత్తం 8 మందికి పాజిటివ్ వచ్చింది. ఆరుగురు గంజాయి సేవించగా, మరో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్టేషన్‌కు తరలించారు.
అయితే దాడులు జరిగిన సమయంలో పబ్‌లో ప్రముఖ నటి హేమ (Actress Hema) కూడా అక్కడే ఉన్నది. దీంతో ఆమెకు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. అందులో నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మళ్లీ పబ్‌కి వచ్చాను.. ఇప్పుడే ఈగల్ టీం వాళ్లు చేసిన డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది’ అంటూ తన యూరిన్ టెస్ట్ రిపోర్ట్ చూపించింది. ‘మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదని.. రేపు మళ్లీ టెస్ట్ డ్రగ్స్ టెస్ట్‌కి సంబంధించిన మరో వీడియో పోస్ట్ చేస్తా’ అంటూ అందులో చెప్పింది. కాగా, పబ్ ప్రాంగణం నుంచే ఈ వీడియో రిలీజ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతేడాది బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె కొన్ని రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. అయితే ఆమెకు బెంగళూరు కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది.
HYD కొండాపూర్‌లోని క్వాక్ ఎరీనా పబ్‌పై పోలీసుల రైడ్‌లో కొంతమందికి పాజిటివ్ వచ్చింది అని చెబుతున్నారు.
అక్కడ ఉన్న తనకు టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చిందని నటి హేమ వీడియో విడుదల చేశారు. హేమ ఎప్పుడు తప్పు చేయదు జెన్యూన్ గా ఉంటుంది..ముక్కు సూటిగా మాట్లాడుతుంది ..అని అన్నారు నటి హేమ… pic.twitter.com/gzH3Y6EhQn
— Tupaki (@tupaki_official) April 3, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






