Hyderabad | పిల్లి మరణం తట్టుకోలేక.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
Hyderabad | కొందరు పెంపుడు జంతువులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటికి ఏమన్న జరిగితే తట్టుకోలేరు. పెంపుడు పిల్లి మరణించిందని చెప్పి.. ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : కొందరు పెంపుడు జంతువులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటికి ఏమన్న జరిగితే తట్టుకోలేరు. పెంపుడు పిల్లి మరణించిందని చెప్పి.. ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బడంగ్‌పేట్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బడంగ్‌పేట్‌కు చెందిన బట్ట హిమబిందు(20) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఆమె పిల్లిని పెంచుకుంటుంది. అనారోగ్య కారణాల వల్ల ఆ పిల్లి 18న తెల్లవారుజామున 4 గంటలకు చనిపోయింది. ఇక పిల్లి మరణించడంతో.. హిమబిందు తీవ్ర మనస్తాపానికి గురైంది. బోరున విలపించింది.
పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక.. హిమబిందు అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 18న ఉదయం 4.40 గంటలకు హిమబిందు సూసైడ్ చేసుకున్నట్లు ఆమె సోదరుడు పోలీసులకు తెలిపాడు. మా సోదరి మరణంపై తమకు ఎలాంటి అనుమానం లేదు.. పిల్లి చనిపోయిందని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





