త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Danam Nagender | నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని.. దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Danam Nagender | ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్( Danam Nagender ) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ( Congress Party )లోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని అని ఆయ‌న తేల్చిచెప్పారు.

S

Hyderabad | Published On Dec 24, 2025, 12.22 pm IST

Danam Nagender | నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని.. దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Danam Nagender | త్రినేత్ర‌.న్యూస్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్( Danam Nagender ) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ( Congress Party )లోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని అని ఆయ‌న తేల్చిచెప్పారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే జీహెచ్ఏంసీ ఎన్నికల్లో( GHMC Elections ) కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం అని ఆయ‌న పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరిగి కాంగ్రెస్ పార్టీ, ఏంఐఏం పార్టీల తరపున ప్రచారం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.. నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం నాగేంద‌ర్ మ‌రోసారి ఉద్ఘాటించారు.

2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్‌పై గెలిచిన దానం నాగేంద‌ర్.. ఆ త‌ర్వాత సీఎం రేవంత్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో దానం ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డార‌ని బీఆర్ఎస్ పార్టీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement