త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyberabad | సైబరాబాద్‌లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 315 మందిపై కేసులు

Cyberabad | సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించినట్లు ట్రాఫిక్ డీసీపీ–I రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 315 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

P

Hyderabad | Published On Apr 19, 2026, 3.38 pm IST

Cyberabad | సైబరాబాద్‌లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 315 మందిపై కేసులు
Advertisement

Cyberabad | సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించినట్లు ట్రాఫిక్ డీసీపీ–I రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 315 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో 268 మంది ద్విచక్ర వాహనదారులు, 15 మంది ఆటో డ్రైవర్లు, 28 మంది కార్ డ్రైవర్లు, 4 మంది హెవీ వాహనదారులు మ‌ద్యం తాగి ప‌ట్టుబ‌డ్డారు.

వారందరినీ చట్టపరంగా కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరమని, మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గత వారం (13నుంచి 18 వ‌ర‌కు) మొత్తం 120 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు ప‌రిష్క‌రించాయ‌ని, ఇందులో ఒకరికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించగా, 119 మందికి జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ అధికారులు వివ‌రించారు.

Advertisement
Advertisement