Traffic Advisory | కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటన.. ఈ ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు..
Traffic Advisory | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్‌లో (Muneerabad) అధ్వయ కన్వెన్షన్ వేదికగా పార్టీ పేరును ప్రకటిస్తారు, జెండా ఆవిష్కరిస్తారు.
Traffic Advisory | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్‌లో (Muneerabad) అధ్వయ కన్వెన్షన్ వేదికగా పార్టీ పేరును ప్రకటిస్తారు, జెండా ఆవిష్కరిస్తారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కవిత మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు మునీరాబాద్ ప్రాంతంలో భారీ రద్దీ ఉంటుందని ట్రాఫిక్ అడ్వైజరీ (Traffic Advisory) జారీచేశారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో మునీరాబాద్ చుట్టుపక్కల NH-44, అంతర్గత గ్రామ రహదారులపై ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో మునీరాబాద్ గ్రామ రహదారుల్లోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు.
కండ్లకోయ, ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ లేన్‌ల ద్వారా దారి మళ్లింపులు ఏర్పాటు చేశారు. పూడూరు గ్రామ వై-జంక్షన్, సీఎంఆర్ కాలేజ్ ఎక్స్ రోడ్ల వంటి కీలక కూడళ్ల వద్ద, వాహనాలను మేడ్చల్, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించనున్నారు. రద్దీ సమయాల్లో మునీరాబాద్ మార్గాన్ని తప్పించి, మేడ్చల్, కిస్తాపూర్, సమీప ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ప్రజలు సహకరించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






