త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Advisory | పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ బ‌హిరంగ స‌భ‌.. ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన పోలీసులు..!

Traffic Advisory | సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో ఆదివారం బీజేపీ పార్టీ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. ఈ స‌భ‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హాజ‌రుకానున్నారు. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

P

Hyderabad | Published On May 9, 2026, 9.15 pm IST

Traffic Advisory | పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ బ‌హిరంగ స‌భ‌.. ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన పోలీసులు..!
Advertisement

Traffic Advisory | సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో ఆదివారం బీజేపీ పార్టీ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. ఈ స‌భ‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హాజ‌రుకానున్నారు. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సుల రాకపోకలు, పార్కింగ్‌కు సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు మార్గదర్శకాలు జారీ చేశారు. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ మార్గాల నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వద్ద ప్రయాణికులను దించాల్సిందిగా సూచించారు. వీటి పార్కింగ్‌ను ఐఏఎల్‌ఏ (IALA) పార్కింగ్, ఆర్‌జీఐ స్టేడియం, ఉప్పల్ భగాయత్, రైల్వే డిగ్రీ కాలేజీ, ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేశారు. ఉప్పల్ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ నాగరాజు (8712662421)ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ మార్గాల నుంచి వచ్చే బస్సులు బోయిన్‌పల్లి, తిరుమలగిరి మీదుగా ధోబీఘాట్ వద్ద నిలిపివేయనున్నారు. వీటి కోసం బైసన్ పోలో గ్రౌండ్, ధోబీఘాట్, ఇంపీరియల్ గార్డెన్, బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. తిరుమలగిరి ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ వి. సర్దార్ నాయక్ (8712660624)ను సంప్ర‌దించాల‌ని పోలీసులు సూచించారు. మెహదీపట్నం, మహబూబ్‌నగర్, క‌ర్నాట‌క మార్గాల నుంచి వచ్చే బస్సులు రేతిబౌలి, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ మీదుగా నెక్లెస్ రోడ్ (సంజీవయ్య పార్క్) వద్ద నిలిపివేయనున్నారు. అదనపు పార్కింగ్‌గా ఎన్‌టీఆర్ స్టేడియం, బస్ భవన్, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. అధికారులు ఎస్ మోహన్ కుమార్ (8712660614), ఏ శ్రీనివాస్ (8712660617)ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

సంగారెడ్డి, హైటెక్ సిటీ మార్గాల నుంచి వచ్చే బస్సులు జూబ్లీ చెక్ పోస్ట్, పంజాగుట్ట మీదుగా నల్లగుట్ట వద్ద నిలిపివేయాల్సి ఉంటుంది. వీటి పార్కింగ్ కూడా నెక్లెస్ రోడ్‌లోనే ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలు నిండిపోతే వాహనాలను నగర శివార్లలోనే నిలిపివేస్తామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. డ్రైవర్లు, సభ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement