SPDCL | గడువులోగా బిల్లు కట్టకపోతే కరెంటు కట్..: ఎస్పీడీసీఎల్
SPDCL | ఇంటి పన్ను చెల్లించకపోతే కరెంటు కట్ చేస్తామని జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్పీడీసీఎల్ (SPDCL) కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు.
SPDCL | త్రినేత్ర.న్యూస్: ఇంటి పన్ను చెల్లించకపోతే కరెంటు కట్ చేస్తామని జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్పీడీసీఎల్ (SPDCL) కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. గడువులోగా బిల్లు కట్టనివారికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరెంట్ మీటరు రీడర్లకు లక్ష్యాలు విధించి అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం నెలలో 10 రోజులు మాత్రమే మీటరు రీడర్లు పనిచేస్తుండగా మిగతా రోజుల్లో కూడా పనిచేసేందుకు వీలుగా ఈ బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్‌పీడీసీఎల్‌లో సుమారు 15 వందల మంది మీటరు రీడర్లు పనిచేస్తున్నారు. వారిలో ప్రతీ మీటరు రీడరు నెలకు వంద కనెక్షన్లను తనిఖీ చేసి కరెంట్ బిల్ కట్టకపోతే సరఫరా నిలిపివేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఇందులో భాగంగా మూడునెలల నుంచి కరెంట్ బిల్లులు కట్టకుండా ఇంటికి తాళం వేసిఉంటే నిజమా కాదా అనేది మీటరు రీడరు తనిఖీ చేయాల్సి ఉంటుంది. చాలామంది బిల్లులు చెల్లించకపోవడంతో సంస్థకు భారీనష్టం వాటిల్లుతున్నదని, లైన్‌మెన్లు కరెంట్ కట్ చేయడానికి వెళ్తే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లైన్‌మెన్ల బాధ్యతలను మీటర్ రీడర్లకు అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






