Shyam Prasad Reddy | పెంటారెడ్డి మాట వినండి.. పంపులు ఆన్ చేయండి.. సీఎం రేవంత్‌కు శ్యాంప్రసాద్ రెడ్డి సూచన
Shyam Prasad Reddy | తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సలహాదారుగా కొనసాగుతున్న రిటైర్డ్ ఇంజినీర్ పెంటారెడ్డి( Penta Reddy ) మాట వినైనా.. కన్నెపల్లి( Kannepalli ) పంపులు ఆన్ చేయండని సీఎం రేవంత్ రెడ్డి( CM revanth Reddy )కి తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి( Shyam Prasad Reddy ) సూచించారు.
Shyam Prasad Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సలహాదారుగా కొనసాగుతున్న రిటైర్డ్ ఇంజినీర్ పెంటారెడ్డి( Penta Reddy ) మాట వినైనా.. కన్నెపల్లి( Kannepalli ) పంపులు ఆన్ చేయండని సీఎం రేవంత్ రెడ్డి( CM revanth Reddy )కి తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి( Shyam Prasad Reddy ) సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యాం ప్రసాద్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి లిఫ్ట్‌ల మీద ఒక అడ్వైజర్ గారు ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా పని చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నారు. వారు పెంటారెడ్డి గారు.. వారు ఎస్సీ రిటైర్డ్ ఫ్రమ్ ఏపీ జెన్‌కో. ఏఎంఆర్పీ మెగా ఇరిగేషన్ ప్రాజెక్టు లిఫ్ట్ స్కీమ్‌లో కలిసి పని చేశాం. ఆయన జెన్ కో తరపున, నేను ఇరిగేషన్ తరపున. రిటైర్ అయ్యాక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్‌లో వారు చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి ఈ ప్రాజెక్టు గురించి, పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ ఇవన్నీ కూడా మేం ఫార్ములేట్ చేసి ఊరురా తిరిగి మండలం మండలంలో మీటింగ్ పెట్టి వాటిని ఒప్పించగలిగాం. పాత గవర్నమెంట్‌లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతోనే. డిండికి రాజశేఖర్ రెడ్డి గారు 2007లో పరిపాలన అనుమతి ఇచ్చారు. అదే విధంగా 2013 ఆగస్టు 8న కిరణ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి పరిపాలనా అనుమతి ఇవ్వడం జరిగింది.. సర్వేలకు కూడా. ఈ రెండు కూడా గత ప్రభుత్వాలతోనే అంటే సమైక్య రాష్ట్రంలోని ముఖ్యమంత్రులతోనే మేం సాధించాం. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు మొత్తంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ వాళ్లే 90 శాతం ఎఫర్ట్ పెట్టినం. ఆ జిల్లాల్లోని ప్రజలను ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది.. వారు కూడా సహకరించడం జరిగింది అని ఆయన తెలిపారు.
పెంటారెడ్డి బాధపడుతున్నారు
ఇప్పటికైనా ఆ పెంటారెడ్డి గారు అడ్వైజర్‌గా ఉన్నారు. వారిని అడ్వైజ్ తీసుకోమనండి పంపులు నడుస్తాయా నడవవా అని. మొన్న మేం ఫోన్ చేసినప్పుడు నేను చెప్తే ఎవరు వింటలేరు అంటున్నరు వారు. వింటలేనప్పుడు మరి అడ్వైజ్ చేసినప్పుడు ఒక లెటర్ రాసి ఎవరికి రాస్తావో రాయి.. ఈ విధంగా చేసుకోవచ్చు.. ఇప్పుడున్న లెవల్ పర్మిట్ చేస్తది కాబట్టి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చని మీరు అంటున్నప్పుడు లెటర్ రూపకంగా రాయండి. రాసేస్తే అప్పుడు వాళ్లు ఒప్పుకుంటారా లేదా అనేది తెలుస్తది.. నోటిమాట కాదు లెటర్ రూపకంగా రాసి పెట్టండి అని చెప్పేసి మేము వారికి అడ్వైస్ ఇచ్చాం. వారు బాధపడుతున్నారు మాకు చెప్పి. కాబట్టి పెంటా రెడ్డి గారు కూడా అడ్వైజరే కాబట్టి వారి అడ్వైస్ ప్రకారం నడవమని చెప్పేసి నేను విన్నవిస్తున్నాను అని శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
జులై 13, 2026

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
జులై 13, 2026

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026
తాజావార్తలు
- ●KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
- ●CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
- ●Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...
- ●Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
- ●Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
- ●Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ 'గురుదక్షిణ'.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?

Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం



