Congress MLA Anirudh Reddy | “నాలుక జాగ్రత్త పవన్.. కావాలంటే గుజరాత్‌లో పార్టీ పెట్టుకో!” పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ డిప్రెషన్‌లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Congress MLA Anirudh Reddy | త్రినేత్ర.న్యూస్ : జడ్చర్ల (Jadcherla) కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ ఇటీవల తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన.. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకుంటే తగిన బుద్ధి చెబుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గుజరాత్‌లో పార్టీ పెట్టుకో
పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలంగాణలో (Telangana) చెల్లవని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీని (BJP), అమిత్ షాను మెప్పించడానికే పవన్ ఇక్కడ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. "నీకు పార్టీ పెట్టుకుని పోటీ చేయాలని ఉంటే వెళ్లి గుజరాత్‌లో పెట్టుకో.. ఎవరూ వద్దనరు. కానీ ఏపీలో (AP) గెలిచిన నువ్వు, డిప్యూటీ సీఎంగా అక్కడ ఎన్ని రోజులు ఉంటున్నావు? హైదరాబాద్‌లో ఎన్ని రోజులు ఉంటున్నావు?" అంటూ సూటిగా ప్రశ్నించారు. ఏపీలో వచ్చేసారి మళ్లీ అధికారం దక్కదన్న భయంతోనే, తెలంగాణలో అడుగుపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణపై నిజంగా అంత ప్రేమ ఉంటే గత 12 ఏళ్లుగా ఎక్కడికి పోయావని అనిరుధ్ నిలదీశారు.
నేను ఫస్ట్ టైమే గెలిచా
పవన్ గురించి మాట్లాడే స్థాయి తనకు లేదని కొందరు చేస్తున్న విమర్శలకు అనిరుధ్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. "నేను జడ్చర్లలో పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచాను. పవన్ లాగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోలేదు" అని చురకలంటించారు. అంతేకాకుండా, పవన్ అన్న చిరంజీవి (Chiranjeevi) అప్పట్లో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తేనే, ఆయనను రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రి పదవి ఇచ్చామని గుర్తుచేశారు.
డిప్రెషన్‌లో ఉన్నారు
పవన్ నటిస్తున్న సినిమాలు 'ఓజీ' (OG), 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫ్లాప్ అయ్యాయని, ఆ డిప్రెషన్‌లో (Depression) ఉండిపోయిన పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ తీరును చూసి ఇతర సినీ నటులు కూడా సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు. నరదిష్టి పేరుతో తెలంగాణ ప్రజలను అవమానించిన పవన్.. ఇకపై తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు నాలుక అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దేవుడికి (కొండగట్టు అంజన్న) విరాళంగా ఇచ్చిన పైసల గురించి కూడా గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు.
జన్వాడ భూమిపై సంచలన ఆరోపణలు
జన్వాడలో (Janwada) పవన్ ఫామ్‌హౌస్ వివాదంపై కూడా ఎమ్మెల్యే అనిరుధ్ స్పందించారు. పవన్ ఆక్రమించిన ఆ స్థలం.. ఒకప్పుడు ఒక పంట పండే చెరువు శిఖం, అసైన్డ్ భూమి అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆ భూమిలోకి ఎవరినీ రానివ్వకుండా కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | తెలంగాణ మా అయ్య జాగీరే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్..!
జూన్ 2, 2026

Pawan Kalyan | 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ చేస్తుంది.. పవన్ కల్యాణ్ ప్రకటన
జూన్ 2, 2026

Vemula Veeresham | ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు: వేముల వీరేశం
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●Machiavellian Politics Telangana | ఆంధ్రా నాయకుల 'మెకియవెల్లీ' గేమ్.. రేవంత్ సర్కార్ సపోర్ట్! తెలంగాణ చైతన్యాన్ని టార్గెట్ చేస్తున్న 'బిగ్ ఫిష్' ఎవరు?
- ●Uttam Kumar Reddy | పాలమూరులో నీటిపారుదలపై సీఎం రేవంత్ ఫోకస్.. రెండు రోజుల పర్యటనలో ప్రాజెక్టుల తనిఖీ..!
- ●Buchi Babu Sana | పెద్ది ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదు...చిరంజీవి తిడతారనుకున్నా - పెద్దిపై బుచ్చిబాబు సానా కామెంట్స్
- ●Nepal PM Balen Shah | 'మేమూ ఇండియాలోకి చొరబడ్డాం'.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు, విద్యార్థులు
- ●Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోషూట్ - ఆఫర్ల కోసమేనా?
- ●Kavitha | మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూ పోరాటం : కవిత

Machiavellian Politics Telangana | ఆంధ్రా నాయకుల 'మెకియవెల్లీ' గేమ్.. రేవంత్ సర్కార్ సపోర్ట్! తెలంగాణ చైతన్యాన్ని టార్గెట్ చేస్తున్న 'బిగ్ ఫిష్' ఎవరు?

Uttam Kumar Reddy | పాలమూరులో నీటిపారుదలపై సీఎం రేవంత్ ఫోకస్.. రెండు రోజుల పర్యటనలో ప్రాజెక్టుల తనిఖీ..!

Buchi Babu Sana | పెద్ది ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదు...చిరంజీవి తిడతారనుకున్నా - పెద్దిపై బుచ్చిబాబు సానా కామెంట్స్

Nepal PM Balen Shah | 'మేమూ ఇండియాలోకి చొరబడ్డాం'.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు, విద్యార్థులు



