CM Revanth Reddy | డబ్బులు తీసుకోండి.. భూములు ఇవ్వండి.. రైతులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీ కోసం రైతులు భూములు ఇవ్వాల్సిందే.. ఇది ఆగేపని కాదు.. అంతా అయిపోయింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా మీ భూములు ప్రభుత్వానికి బదిలీ అవుతాయని సీఎం తెలిపారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఫ్యూచర్ సిటీ కోసం రైతులు భూములు ఇవ్వాల్సిందే.. ఇది ఆగేపని కాదు.. అంతా అయిపోయింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా మీ భూములు ప్రభుత్వానికి బదిలీ అవుతాయని సీఎం తెలిపారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు శంకుస్థాపన సందర్భంగా సీఎం ప్రసంగించారు.
దేవేందర్ గౌడ్ వల్లే ఈ ప్రాంతానికి పేరు వచ్చింది. ఫ్యూచర్ సిటీలో కొంత మంది రైతులకు నష్ట పరిహారం రాలేదని కొంత నిష్టూరకం ఉంది. ఈ నష్ట పరిహారం సమస్య పరిష్కరిస్తే స్థానిక ప్రజాప్రతినిధులు చరిత్రలో మిగిలిపోతారు. నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కచ్చితంగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది అని, లీగల్ లిటిగేషన్లు లేకుండా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులను సీఎం కోరారు.
ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా.. లీగల్ ప్రాసెస్ అంత కంప్లీట్ అయింది. ఈ రోజు కాకపోతే రేపైనా భూమి ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. అది ఆగే అవకాశం లేదు. తాత్కాలికంగా వాయిదా పడొచ్చు. కానీ భూముల బదిలీ జరిగి తీరుతుంది. ఆనాడు పైసలు తీసుకుంటే కల్వకుర్తి అవతలికి పోతే మీకు రెండింతల భూమి వచ్చేది. ఇప్పుడు ధరలు పెరిగాయి. ఈ పైసలతో గజాలు కొనడానికి కూడా సరిపోవు. డబ్బులు తీసుకోండి.. కొంచెం దూరం వెళ్లి భూమి కొనుక్కోండి. మీ పిల్లలకు స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఇతర అవకాశాలు కల్పిద్దాం. రైతుల బాధ వినండి.. గుంజుకుంటున్నారన్న అభద్రతాభావం కల్పించొద్దు. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి అని సీఎం సూచించారు.
జూపల్లి కృష్ణారావు ఇండస్ట్రీస్ మినిస్టర్‌గా ఉన్నప్పుడే 90 శాతం భూములు క్లియర్ అయ్యాయి. ఆ రోజే డబ్బులు తీసుకుంటే యాచారం, కడ్తాల్, ఆమనగల్ వద్ద భూములు వచ్చేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. ఐదు ఎకరాలు కొనుక్కుందాం ఫ్యూచర్ సిటీ వద్ద అని కొందరిని అడిగితే.. ఆరు నెలల కింద మూడు కోట్లు, ఇప్పుడు 6 కోట్లు అని చెబుతున్నరు. కొనుక్కొనేందుకు మా స్థాయి దాటిపోయింది. ఫ్యూచర్ సిటీలో మాకు భూమి లేదనుకునే పరిస్థితి వచ్చింది. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రైతులు డబ్బులు తీసుకోవాలి.. భూములు ఇవ్వాలి. పేదల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించండి.. అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు.. కాబట్టి వారి పట్ల సానుకూలంగా వ్యవహరించండి.. మంత్రి వద్దకు లేదంటే నా వద్దకు తీసుకురండి.. సమస్యలను పరిష్కారం చేద్దాం. ఈ రెండేళ్లు సహకరిస్తే.. అద్భుతమైన పునాదులు పడుతాయి.. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ట్రంప్, ఎలాన్ మస్క్ అయినా ఇక్కడికి రావాల్సిందే. ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయామన్న పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకువస్తుంది అని సీఎం రేవంత్ అన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



