CM Revanth Reddy | నీళ్లు నిలిచినా.. వాహనాలు ఆగినా.. మీ ఉద్యోగాలుండవ్..
CM Revanth Reddy | హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచినా, వాహనాలు ఆగినా మీ ఉద్యోగాలు ఉండవ్ అధికారులను సీఎం హెచ్చరించారు. భారీ వర్షం నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
భారీ వర్షాలపై సీఎం రేవంత్ ఆర్డర్స్
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచినా, వాహనాలు ఆగినా మీ ఉద్యోగాలు ఉండవ్ అధికారులను సీఎం హెచ్చరించారు. భారీ వర్షం నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పని చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే సిబ్బంది, యంత్రాలను రంగంలోకి దించాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని, కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Yadadri | యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత.. ఎందుకంటే.?
- ●Stephen Raveendra | అక్టోబర్ నుంచే ధాన్యం కొనుగోళ్లు.. 65 లక్షల టన్నులు లక్ష్యం: స్టీఫెన్ రవీంద్ర
- ●Venkatesh | ఆదర్శ కుటుంబం వాయిదా - వారం వెనక్కి వెళ్లిన వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ
- ●Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్
- ●IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!
- ●Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన

Yadadri | యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత.. ఎందుకంటే.?

Stephen Raveendra | అక్టోబర్ నుంచే ధాన్యం కొనుగోళ్లు.. 65 లక్షల టన్నులు లక్ష్యం: స్టీఫెన్ రవీంద్ర

Venkatesh | ఆదర్శ కుటుంబం వాయిదా - వారం వెనక్కి వెళ్లిన వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ

Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్




