త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kailash Mansarovar Yatra | ఆక‌స్మిక వ‌ర‌ద‌లు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌!

Kailash Mansarovar Yatra | త్రినేత్ర‌.న్యూస్‌: టిబెట్‌, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఆక‌స్మిక వ‌ర‌ద‌ల (Nepal Tibet Flash Floods) ప్ర‌భావం కైలాస మానస సరోవర్ యాత్రపై పడింది. జలప్రళయం కారణంగా కీలకమైన రహదారులు దెబ్బతినడంతో నేపాల్ మీదుగా జరగాల్సిన మానస సరోవర్ యాత్రను (Kailash Mansarovar Yatra) తాత్కాలికంగా నిలిపివేశారు.

G

International | Published On Aug 27, 2026, 7.19 am IST

Kailash Mansarovar Yatra | ఆక‌స్మిక వ‌ర‌ద‌లు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌!
Advertisement

Kailash Mansarovar Yatra | త్రినేత్ర‌.న్యూస్‌: టిబెట్‌, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఆక‌స్మిక వ‌ర‌ద‌ల (Nepal Tibet Flash Floods) ప్ర‌భావం కైలాస మానస సరోవర్ యాత్రపై పడింది. జలప్రళయం కారణంగా కీలకమైన రహదారులు దెబ్బతినడంతో నేపాల్ మీదుగా జరగాల్సిన మానస సరోవర్ యాత్రను (Kailash Mansarovar Yatra) తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఇప్ప‌టికే మానస స‌రోవ‌ర్ యాత్ర‌కు బుక్ చేసుకున్న యాత్రికులు ఆందోళ‌న చెందుతున్నారు.

బుధవారం ఉద‌యం నేపాల్‌ను మెరుపు వ‌ర‌ద‌లు (Nepal Flash Floods) ముంచెత్తిన విష‌యం తెలిసిందే. టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భ‌వించే భోటే కోషి న‌దిలో ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో నీటి మ‌ట్టం ఒక్క‌సారిగా పెరిగింది. దీంతో ఫ్లాష్ ఫ్ల‌డ్స్ వ‌చ్చాయి. టిబెట్ స‌రిహ‌ద్దు స‌మీపంలోని ర‌సువా (Rasuwa) జిల్లాలోని కొన్ని ప్రాంతాల‌ను ఈ వ‌ర‌ద‌లు అత‌లాకుత‌లం చేశాయి. గ్రామాల‌కు గ్రామాలే కొట్టుకుపోయాయి. ఇండ్లు, వాహ‌నాలు, వంతెన‌లు కొట్టుకుపోయాయి. అనేక రోడ్లు ధ్వంస‌మ‌య్యాయి. మౌలిక స‌దుపాయాల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లిన‌ట్లు అధికారులు తెలిపారు. సుమారు 160 మంది మృతిచెంద‌గా, 750 మందికిపైగా గ‌ల్లంత‌య్యారు. వారిలో 133 మంది భార‌తీయులే ఉన్నారు. ఇందులో 77 మంది ఈశా ఫౌండేష‌న్ యాత్రికులు ఉన్నారు. మ‌రోవైపు టిబెట్‌లో 265 మంది క‌నిపించ‌కుండా పోగా, ముగ్గురు మ‌ర‌ణించారు.

జ‌ల‌ప్ర‌ళ‌యం కార‌ణంగా మానస సరోవరానికి వెళ్లే రహదారి మార్గాలు మూసుకుపోయాయి. ఈ నేప‌థ్యంలో గురువారం నుంచి ఖాట్మాండు నుంచి ప్రారంభం కావాల్సిన యాత్రను నిలిపివేశారు. మానస సరోవరం చేరుకునేందుకు ఖాట్మాండు-రసువగఢీ-కీరుంగ్ మార్గంలోని.. రసువగఢీ (Rasuwagadhi) ప్రాంతంలో భారీగా వరదలు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో యాత్రికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించినట్లు స‌మాచారం. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో రాకపోకలు క్లిష్టంగా మారడంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే యాత్ర‌ను నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు ఇప్ప‌టివ‌ర‌కు ధృవీక‌రించ‌లేదు.

Advertisement
Advertisement