MLA Rajagopal Reddy | రేవంత్‌కు బాకా కొట్టండి.. కానీ మా జోలికొస్తే ఖబర్దార్
MLA Rajagopal Reddy | ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తారాస్థాయికి చేరాయి. బుధవారం డిప్యూటీ సీఎం భట్టీతో భేటీ అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి రియాక్షన్‌తో రాజకీయ సెగలు మరోసారి భగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డికి బాకా పనులు చేసుకోవచ్చని.. కానీ మా జోలికొస్తే ఖబర్దార్ అంటూ రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
- సోదరా రాధాకృష్ణా.. మా గురించి రాస్తే చూసుకొని రాయి.. లేదంటే బాగుండదు
- ఆంధ్రా ఛానళ్ల బోడి సర్టిఫికెట్ మాకు అక్కర్లేదు
- ఫేక్ కథనాలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్‌ల డ్రామాలకు బెదరా
- రేవంత్ బ్యాచ్‌తో పాటు ఏబీఎన్ మీడియాకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాస్ వార్నింగ్
MLA Rajagopal Reddy | త్రినేత్ర.న్యూస్: ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తారాస్థాయికి చేరాయి. బుధవారం డిప్యూటీ సీఎం భట్టీతో భేటీ అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి రియాక్షన్‌తో రాజకీయ సెగలు మరోసారి భగ్గుమన్నాయి. అసలు కాంగ్రెస్ వర్సెస్ ఎల్లో కాంగ్రెస్ మధ్య ఏర్పడిన ఈ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భట్టీతో భేటీ తర్వాత రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి బాకా పనులు చేసుకోవచ్చని.. కానీ మా జోలికొస్తే ఖబర్దార్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు రేవంత్ బ్యాచ్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూనే మరోవైపు ఏబీఎన్ మీడియా ఛానల్ రాధాకృష్ణ పేరు తీసి ఆయనపై ఊగిపోయారు.
ఎవడికీ భయపడేది లేదు.
రేవంత్ బ్యాచ్‌పై మరింత పదునైన విమర్శలు ఎక్కుపెట్టారు. ఫేక్ కథనాలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్టుల డ్రామాలకు బెదిరేది లేదు. మాకు కాంగ్రెస్‌తో పంచాయతీ లేదు. తెలంగాణ ఉద్యమం చేసినోళ్లం.. ఎవడికీ భయపడేది లేదు. ఉద్యమంలో పాల్గొన్నోళ్లకే పదవులు రావాలి.
సోదరా రాధాకృష్ణ.. మేం అనుకుంటే ఇక్కడ ఆంధ్రా ఛానళ్లు ఉండవ్..
సోదరా ఏబీఎన్ రాధాకృష్ణ మా గురించి రాసే ముందు చూసుకొని రాయి. లేకుంటే బాగుండదు. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది. ఏబీఎన్ లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి మాకూ ఉంది. మేం అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది. ఇప్పుడు ఏబీఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? మా గురించి రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్లకు వార్నింగ్ ఇస్తున్నా. ఆంధ్ర మీడియా ఛానళ్లు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఫేక్ స్టోరీలతో మమ్మల్ని కంట్రోల్ చేయలేరు. ఆంధ్రా మీడియా ఛానెల్ మాకు అవసరం లేదు. ఆంధ్రా మీడియా బోడి సర్టిఫికెట్ మాకు అక్కెర్లేదు అని తనదైన స్టయిల్‌లో రాజగోపాల్‌రెడ్డి ఉతికిఆరేశారు. మరోవైపు కొండా మురళి మాట్లాడుతూ సుష్మిత వ్యవహారం ఆమె వ్యక్తిగతమన్నారు. ఆమె వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏదేమైనప్పటికీ భట్టీతో భేటీ అనంతరం ఇటు రాజగోపాల్ రెడ్డి, అటు కొండా మురళి రియాక్షన్ అయిన తీరుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం
ఆగస్టు 26, 2026

Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు
ఆగస్టు 26, 2026

పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం
- ●LPG e-KYC Deadline 2026 | గ్యాస్ కనెక్షన్ ఉందా? e-KYC లాస్ట్ డేట్ పెంపు.. మొబైల్లోనే ఇలా ఈజీగా పూర్తి చేయండి
- ●TGEJAC Protest Indira Park | కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సై.. రేపే ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల 'మహా ధర్నా'
- ●Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు
- ●పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం
- ●PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ..?

Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం

LPG e-KYC Deadline 2026 | గ్యాస్ కనెక్షన్ ఉందా? e-KYC లాస్ట్ డేట్ పెంపు.. మొబైల్లోనే ఇలా ఈజీగా పూర్తి చేయండి

TGEJAC Protest Indira Park | కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సై.. రేపే ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల 'మహా ధర్నా'

Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు



