త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బ‌స్సు.. ఏడుగురి మృతి, మ‌రో 8 మందికి గాయాలు

Travels Bus | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేటలో (Chilakaluripet) ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. చిల‌క‌లూరిపేట అడ్డ‌రోడ్డు వ‌ద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు (Travels Bus) ఆటోను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మ‌ర‌ణించారు.

G

National | Published On Aug 27, 2026, 6.40 am IST

Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బ‌స్సు.. ఏడుగురి మృతి, మ‌రో 8 మందికి గాయాలు
Advertisement

Travels Bus | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేటలో (Chilakaluripet) ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. చిల‌క‌లూరిపేట అడ్డ‌రోడ్డు వ‌ద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు (Travels Bus) ఆటోను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మ‌ర‌ణించారు. మ‌రో 8 మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో న‌లుగురు చిన్నారులు ఉన్నారు. న‌లుగురు ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతిచెంద‌గా, ఇద్ద‌రు గుంటూరు జీజీహెచ్‌లో (GGH), ఒక‌రు చిల‌క‌లూరిపేట ప్ర‌భుత్వ ద‌వాఖానలో చ‌నిపోయారు.

టావెల్స్ బ‌స్సు విజ‌య‌వాడ నుంచి తిరుప‌తి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోలో 15 మంది ఉన్నార‌ని, వీరంతా బాపట్ల (Bapatla) జిల్లా కొండమంజులూరులో పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్నార‌ని చెప్పారు. మృతులను చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన బొంతా బాబు (62), బొంతా మణెమ్మ (55), సంపూర్ణమ్మ (70), లక్ష్మమ్మ (75), గంగమ్మ (50), చౌటుపల్లి సువార్త (45), మరియమ్మ(45) గా గుర్తించారు.

Advertisement
Advertisement