త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | ప్రేమించిన పాపానికి.. న‌డిరోడ్డుపై యువ‌కుడి దారుణ హ‌త్య‌

Murder | ఆ యువ‌డికి ప్రేమించ‌డమే పాప‌మైంది. క‌లుద్దామ‌ని ప్రియురాలు మెసేజ్ చేయ‌డంతో.. వెళ్లిన యువ‌కుడు దారుణ హ‌త్య‌కు (Murder) గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న సికింద్రాబాద్ చిల‌క‌లగూడ‌లో చోటుచేసుకుంది.

G

Hyderabad | Published On May 8, 2026, 10.05 am IST

Murder | ప్రేమించిన పాపానికి.. న‌డిరోడ్డుపై యువ‌కుడి దారుణ హ‌త్య‌
Advertisement

Murder | త్రినేత్ర‌.న్యూస్‌: ఆ యువ‌డికి ప్రేమించ‌డమే పాప‌మైంది. క‌లుద్దామ‌ని ప్రియురాలు మెసేజ్ చేయ‌డంతో.. వెళ్లిన యువ‌కుడు దారుణ హ‌త్య‌కు (Murder) గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న సికింద్రాబాద్ చిల‌క‌లగూడ‌లో చోటుచేసుకుంది.

జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌కు చెందిన యావ‌న్ (23) బీటెక్ సెకండియ‌ర్ చ‌దువుతున్నాడు. సీతాఫ‌ల్‌మండికి చెందిన యువ‌తిని ఐదేండ్లుగా ప్రేమిస్తున్నాడు. విష‌యం అమ్మాయి ఇంట్లో తెల‌వ‌డంతో వారు యావ‌న్‌ను హెచ్చ‌రించారు. అయినా అత‌డు సీతాఫ‌ల్‌మండిలోని ఇందిరాన‌గ‌ర్‌లో స్నేహితుని వ‌ద్ద ఉంటూ ఆ అమ్మాయిని క‌లుస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆమె సోద‌రుడితో యావ‌న్‌కు గొడ‌వ కూడా జ‌రిగింది.

కాగా, క‌లుద్దామ‌ని యువ‌తి గురువారం యావ‌న్‌కు మెసేజ్ చేసింది. దీంతో అత‌డు చిక‌ల‌క‌లగూడ‌కు వ‌చ్చాడు. స్నేహితుల‌తో క‌లిసి ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. విష‌యం తెలుసుకున్న యువ‌తి సోద‌రుడు.. త‌న స్నేహితుల‌తో క‌లిసి బైకుల‌పై వచ్చి యావ‌న్‌పై క‌త్తుల‌తో దాడి చేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన యావ‌న్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. త‌ల‌, మెడ‌, చేతులు మొత్తం 15 క‌త్తిపోట్లు ప‌డ్డాయ‌ని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో న‌లుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం.
Murder,

Advertisement
Advertisement