త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sudheer Reddy | మూసీ ప్ర‌క్షాళ‌న‌కు బీఆర్ఎస్ వ్య‌తిరేకం కాదు.. స‌భ‌లో తేల్చిచెప్పిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

MLA Sudheer Reddy | మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌కు బీఆర్ఎస్ వ్య‌తిరేకం కాద‌ని ఎల్‌బీన‌గ‌ర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ ప్రక్షాళ‌న‌కు బీఆర్ఎస్ అడ్డుప‌డుతుంద‌ని సీఎం చేస్తున్న వ్యాఖ్య‌లు స‌రికాద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

S

Hyderabad | Published On Mar 18, 2026, 11.22 am IST

MLA Sudheer Reddy | మూసీ ప్ర‌క్షాళ‌న‌కు బీఆర్ఎస్ వ్య‌తిరేకం కాదు.. స‌భ‌లో తేల్చిచెప్పిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Advertisement

MLA Sudheer Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌కు బీఆర్ఎస్ వ్య‌తిరేకం కాద‌ని ఎల్‌బీన‌గ‌ర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ ప్రక్షాళ‌న‌కు బీఆర్ఎస్ అడ్డుప‌డుతుంద‌ని సీఎం చేస్తున్న వ్యాఖ్య‌లు స‌రికాద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా మూసీ న‌ది పున‌రుజ్జీవంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడారు.

ఈ రోజు మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న నేప‌థ్యంలో ఆ న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఉండే ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌తో బ‌తుకుతున్నారు. మూసీ న‌దికి బీఆర్ఎస్ వ్య‌తిరేకం కాదు. మేం మూసీ న‌ది చేయ‌బోతుంటే బీఆర్ఎస్ అడ్డుప‌డుతుంద‌ని సీఎం అంటున్నారు. మూసీ ప్ర‌క్షాళ‌న ప్రారంభ‌మైందే కేసీఆర్ నాయ‌క‌త్వంలో. మొద‌ట మూసీ న‌ది శుద్ధి చేయాల‌ని చెప్పి కేసీఆర్ ప్ర‌భుత్వంలో రూ. 3600 కోట్ల‌తో 31 ఎస్టీపీల‌ను నిర్మించాం. ఆ ప‌నులు 75 శాతం పూర్త‌య్యాయి. మిగ‌తా ప‌నులు పూర్తి చేయాల‌ని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఎక్క‌డ కూడా ఒక్క ఇల్లు కూల‌గొట్ట‌లేదు.

మేం మూసీ ప్ర‌క్షాళ‌న చేస్తే ఎక్క‌డ కూడా ఒక్క ఇల్లు కూల‌గొట్ట‌లేదు. 11 వేల నిర్మాణాలు బ‌ఫ‌ర్ జోన్‌లో గుర్తించాం. కానీ కూల‌గొట్ట‌ లేదు. ఇండ్లు కూల‌గొట్టి మూసీ ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం లేదు అని కేసీఆర్ అన్నారు. ఇంకో ఫార్ములాతో రావాల‌ని సూచించారు. ఫార్ములా త‌యారు చేయ‌గానే ప్ర‌భుత్వం మారిపోయింది. ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌పై క‌క్ష‌గ‌ట్టి రెడ్ మార్కులు పెట్టి నిద్రాహారాలు లేకుండా చేశారు అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement