KTR | మూసీ బఫర్ జోన్ 50 మీటర్లా..? 500 మీటర్లా..? సభలో ప్రశ్నించిన కేటీఆర్
KTR | మూసీ నది ప్రక్షాళన నేపథ్యంలో బఫర్ జోన్‌ను ఎంత మేరకు నిర్ణయించారు.. 50 మీటర్లా..? 500 మీటర్లా..? అని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : మూసీ నది ప్రక్షాళన నేపథ్యంలో బఫర్ జోన్‌ను ఎంత మేరకు నిర్ణయించారు.. 50 మీటర్లా..? 500 మీటర్లా..? అని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
మూసీ నది పునరుజ్జీవంపై జనవరి 2026లో అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యులు ప్రశ్న వేస్తే.. మంత్రి సమాధానం ఇస్తూ.. డీపీఆర్ ప్రిపరేషన్‌కు మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినట్లు తెలిపారు. ఈ కంపెనీని పాకిస్తాన్, సింగపూర్‌లో బ్యాన్ చేశారు. కేసులు ఉన్నాయి. సమాధానంలో డీపీఆర్ ప్రిపరేషన్‌కు 18 నెలలు పడుతుందని చెప్పారు. ఆ మాట నిజమైతే మరి రెండు నెలల వ్యవధిలోనే అంటే మార్చిలోనే ఆకస్మాత్తుగా డీపీఆర్ ఎలా వచ్చింది..? ఇంత మెరుపు వేగంతో ప్రభుత్వం పని చేస్తుంటే మేం కూడా అభినందించాలి. డీపీఆర్ 18 నెలల్లో తయారైతదని చెప్పి.. రెండు నెలల్లోనే చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డీపీఆర్ సభ ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
డీపీఆర్ సబ్‌మిట్ చేయలేదని కుండబద్ధలు కొట్టింది..
హౌస్‌లోనే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనకు ఏడీబీ లోన్ మంజూరు చేసిందని చెప్పారు. ఏడీబీ ఫండింగ్‌పై మూసీ జన ఆందోళన్ ఏడీబీని అడిగితే.. జనవరి 23న సమాధానం ఇచ్చింది. ఎంఆర్డీసీఎల్‌కు ఏడీబీ అప్పు ఇవ్వలేదని, డీపీఆర్ సబ్‌మిట్ చేయలేదని కుండబద్ధలు కొడుతూ ఏడీబీ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. మార్చి 11న మళ్లీ మూసీ జన ఆందోళన్ ఏడీబీని సంప్రదిస్తే జనవరి 23న చెప్పిన మాటనే చెబుతూ మళ్లీ సమాధానం ఇచ్చింది అని కేటీఆర్ తెలిపారు.
మెయిన్ హార్ట్ సంస్థ మీద ఎందుకు ప్రేమనో..
మెయిన్ హార్ట్ సంస్థ మీద ఎందుకు ప్రేమనో తెలియడం లేదు. 16 వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్టును లక్షన్నర కోట్లు అని సీఎం ప్రకటించారు. లక్షన్నర కోట్లు అని చెప్పి.. మొదటి ఫేజ్‌లో ఐదారు వేల కోట్లు అని అంటున్నారు. ఇంకా ఎన్ని ఫేజ్‌లు ఉంటాయి. ఎన్ని ఆస్తులు తీసుకుంటారు..? ఏ రకంగా తీసుకుంటారు..? ఎంతమంది గృహాలు కూల్చుతారో వివరంగా సమాధానం చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
గెజిట్ తప్పా..? మీ సమాధానం తప్పా..?
మెయిన్ హార్ట్ కంపెనీకి పాకిస్తాన్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.. ఇక మూసీ ప్రాజెక్టులో 1400 నిర్మాణాలు పోతాయని మంత్రి అన్నారు. 10 వేల నిర్మాణాలు పోతాయని గవర్నమెంట్ గెజిట్ ఇచ్చింది. ఏది కరెక్ట్. 3279 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. గెజిట్ తప్పా..? మీ సమాధానం తప్పా..? 18 నెలలు పడుతుందని చెప్పి రెండు నెలల్లోనే డీపీఆర్ ఎలా వచ్చింది..? లక్షన్నర కోట్ల బడ్జెట్ అని చెప్పి.. ఐదు వేల కోట్లు అని చెబుతున్నారు అదేం చమత్కారం చేశారు. ఎలా తగ్గించారు. ఇక మూసీ ప్రక్షాళనకు 1435 నిర్మాణాలను గుర్తించామని చెప్పారు. రాజేంద్రనగర్ ఆర్డీవో 50 మీటర్ల బపఫర్ జోన్‌లో తీసుకుంటామన్నారు. 3 వేల ఎకరాలు అంటే 500 మీటర్ల వరకు తీసుకునే అవకాశం ఉంది. బఫర్ జోన్ ఎంత..? ప్రాజెక్టు వ్యయం ఎంత డీపీఆర్ లేకుండా ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు..? వీటన్నింటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



