త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Additional Dowry | మాజీ మంత్రి సోద‌రుని ఇంట్లో క‌ట్న‌కానుక‌ల లొల్లి.. ఆగిన కూతురి పెండ్లి

Additional Dowry | హైప్రొఫైల్ కుటుంబాల‌నూ అద‌న‌పు క‌ట్నం లొల్లి (Additional Dowry) వ‌ద‌ల‌డం లేదు. క‌ట్న కానుకల విష‌యంలో వ‌చ్చిన వివాదం ఓ మాజీ మంత్రి సోద‌రుని ఇంట్లో పెండ్లి ర‌ద్దుకు దారితీసింది.

G

Hyderabad | Published On Apr 27, 2026, 10.14 am IST

Additional Dowry | మాజీ మంత్రి సోద‌రుని ఇంట్లో క‌ట్న‌కానుక‌ల లొల్లి.. ఆగిన కూతురి పెండ్లి
Advertisement

Additional Dowry | త్రినేత్ర‌.న్యూస్‌: హైప్రొఫైల్ కుటుంబాల‌నూ అద‌న‌పు క‌ట్నం లొల్లి (Additional Dowry) వ‌ద‌ల‌డం లేదు. క‌ట్న కానుకల విష‌యంలో వ‌చ్చిన వివాదం ఓ మాజీ మంత్రి సోద‌రుని ఇంట్లో పెండ్లి ర‌ద్దుకు దారితీసింది. ఆంధ్ర‌ప్రదేశ్‌కు చెందిన రాజ‌కీయ నేత ముత్తంశెట్టి కృష్ణారావు కుమార్తెకు, పెండ్యాల సుధాకర్ కుమారుడు సాయి అక్షయ్‌కు పెండ్లి నిశ్చయమైంది. అయితే పెండ్లి కొడుకు త‌ర‌ఫు వారు అద‌న‌పు క‌ట్నం కావాల‌ని డిమాండ్ చేయ‌డంతో రెండు కుటుంబాల మ‌ధ్య వివాదం ప్రారంభ‌మైంది. భారీగా క‌ట్న కానుక‌లు స‌మ‌ర్పించ‌న‌ప్ప‌టికీ అద‌నంగా క‌ట్న కానుకలు కావాలంటూ వేధిస్తున్నారని పెండ్లి కూతురు కుటుంబం ఆరోపిస్తున్న‌ది.

పెండ్లి రద్దు.. కేసు న‌మోదు..

అడిగినంత కట్నం ఇవ్వలేమని కృష్ణారావు కుటుంబం తేల్చిచెప్ప‌డంతో పెండ్లి కొడుకు సాయి అక్షయ్ కుటుంబం అర్థంతరంగా వివాహాన్ని ర‌ద్దు చేసుకున్న‌ది. దీంతో ఆగ్రహానికి గురైన వ‌ధువు బంధువులు, అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని సుధాకర్ నివాసంపై దాడికిపాల్ప‌డ్డారు. అనంత‌రం భారీగా కట్న కానుకలు తీసుకుని, ఇప్పుడు అదనపు కట్నం కోసం వేధిస్తూ పెండ్లి రద్దు చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వ‌రుడు పెండ్యాల సాయి అక్షయ్, తండ్రి సుధాకర్, తల్లి ఉషా తదితరులపై వరకట్న నిషేధ చట్టం (Dowry Prohibition Act) కింద కేసు నమోదు చేశారు.

వారిపై కూడా..

అయితే త‌మ ఇంటిపైకి అనుచరులతో వచ్చి దాడి చేశారంటూ శ్రీనివాస‌రావు కుటుంబ స‌భ్యుల‌పై సుధాకర్ కుటుంబం ఎదురు ఫిర్యాదు చేసింది. దీంతో దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ నిర్మల, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు ప‌క్షాలు ప‌ర‌స్ప‌రం కేసులు పెట్టుకోవ‌డంతో జూబ్లీహిల్స్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, బంగారం లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, బ్యాంకు ఖాతాలను, ఇతర సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు. రాజకీయ ప్రముఖులకు సంబంధించిన విషయం కావడంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement