త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania biscuit | హైద‌రాబాద్‌లో ఘోరం.. కుళ్లిన కోడిగుడ్ల‌తో ఉస్మానియా బిస్కెట్ల త‌యారీ

Osmania biscuit | ఉస్మానియా బిస్కెట్లు తినే వారికి షాకింగ్ న్యూస్. ఎంతో ఇష్టంగా తినే ఈ బిస్కెట్ల త‌యారీకి కుళ్లిన కోడిగుడ్ల‌తో పాటు ర‌సాయనాల‌ను వినియోగించి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు.

S

Hyderabad | Published On Mar 28, 2026, 7.26 am IST

Osmania biscuit | హైద‌రాబాద్‌లో ఘోరం.. కుళ్లిన కోడిగుడ్ల‌తో ఉస్మానియా బిస్కెట్ల త‌యారీ
Advertisement

Osmania biscuit | త్రినేత్ర.న్యూస్ : ఉస్మానియా బిస్కెట్లు తినే వారికి షాకింగ్ న్యూస్. ఎంతో ఇష్టంగా తినే ఈ బిస్కెట్ల త‌యారీకి కుళ్లిన కోడిగుడ్ల‌తో పాటు ర‌సాయనాల‌ను వినియోగించి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు. హైద‌రాబాద్ అంబ‌ర్‌పేట‌లోని ఓ గోడౌన్‌లో అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో ఉస్మానియా బిస్కెట్లు త‌యారు చేస్తూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయారు నిర్వాహ‌కులు.

క‌మ‌లాన‌గ‌ర్‌కు చెందిన మ‌హ్మ‌ద్ మీరాజ్‌(36) అంబ‌ర్‌పేట్‌లో ఉస్మానియా బిస్కెట్ల త‌యారీ కేంద్రాన్ని నిర్వ‌హిస్తున్నాడు. అయితే బిస్కెట్ల త‌యారీకి విచ్చ‌లవిడిగా ర‌సాయ‌నాలు వాడుతున్నార‌ని పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం.. ఆ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వ‌హించారు.

బిస్కెట్ల త‌యారీకి కుళ్లిన కోడిగుడ్ల‌తో పాటు క్యాన్స‌ర్‌కు దారి తీసే ర‌సాయనాల‌ను వినియోగిస్తున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఫ్యాక్టరీ లోపల కనీస పరిశుభ్రత పాటించకుండా, ఈగలు ముసురుతున్న మురికి వాతావరణంలో బిస్కెట్లను తయారు చేస్తున్నారు. త‌యారీదారులు ఎలాంటి గ్లౌసులు చేతుల‌కు ధ‌రించ‌లేదు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ఫ్యాక్టరీపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఫ్యాక్టరీని సీజ్ చేశారు. యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 150 కార్ట‌న్‌ల‌ను పోలీసులు సీజ్ చేశారు. ఒక్కో కార్ట‌న్‌లో 30 ప్యాకెట్లు ఉన్నాయి. బిస్కెట్ త‌యారీకి వినియోగిస్తున్న ప‌దార్థాల‌ను ప‌రీక్ష‌ల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement