త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ఘ‌నంగా బోనాల జాత‌ర‌.. అంబ‌ర్‌పేట అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి సీత‌క్క‌

Hyderabad | హైదరాబాద్‌లో (Hyderabad) బోనాల పండుగ ఘ‌నంగా జ‌రుగుతున్న‌ది. లాల్‌దర్వాజ , అంబ‌ర్‌పేట‌, చిల‌క‌ల‌గూడ‌లో ఆదివారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే భ‌క్తులు అమ్మ‌వారికి బోనాలు (Bonalu) స‌మ‌ర్పిస్తున్నారు. అంబ‌ర్‌పేట‌లో మంత్రి సీత‌క్క (Seethakka) ప్ర‌భుత్వం త‌ర‌పున అమ్మ‌వారికి ప‌టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

G

Hyderabad | Published On Aug 9, 2026, 10.23 am IST

Hyderabad | ఘ‌నంగా బోనాల జాత‌ర‌.. అంబ‌ర్‌పేట అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి సీత‌క్క‌
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్‌లో (Hyderabad) బోనాల పండుగ ఘ‌నంగా జ‌రుగుతున్న‌ది. లాల్‌దర్వాజ , అంబ‌ర్‌పేట‌, చిల‌క‌ల‌గూడ‌లో ఆదివారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే భ‌క్తులు అమ్మ‌వారికి బోనాలు (Bonalu) స‌మ‌ర్పిస్తున్నారు. పెద్ద సంఖ్య‌లో ఆడ‌ప‌డుచులో బోనాల‌తో ఆల‌యాల‌కు త‌ర‌లివ‌స్తున్నారు. అంబ‌ర్‌పేట‌లో మంత్రి సీత‌క్క (Seethakka) ప్ర‌భుత్వం త‌ర‌పున అమ్మ‌వారికి ప‌టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

లాల్‌ద‌ర్వాజ (Lal Darwaza) సింహ‌వాహిని మ‌హంకాళి అమ్మవారి బోనాలతో నగరం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ కార్యక్రమాలు చేశారు. తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు బ‌లిహ‌ర‌ణ‌, అనంత‌రం రాజస‌భ మాజీ స‌భ్యుడు దేవేంద‌ర్ గౌడ్ కుటుంబ స‌భ్యుల చేతుల మీదుగా దేవీ మ‌హా అభిషేకం నిర్వ‌హించారు. దేవాలయం తరఫున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు పొన్నం, కొండా సురేఖ వస్త్రాలు సమర్పించనున్నారు.

రాత్రి 10.30 వరకు అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం, చీరె, సారె సమర్పణ ఉండనుంది. సాయంత్రం సింహవాహిని అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహిస్తారు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లిరానుండ‌టంతో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 2,500 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో ప‌ర్య‌వేక్షిస్తున్నారు. సోమ‌వారం ఉద‌యం రంగం భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్ర నిర్వహించునున్నారు. సింహ‌హిని అమ్మ‌వారిని ప్ర‌ముఖులు ద‌ర్శించుకుంటున్నారు.

Advertisement
Advertisement