Hyderabad | కోఠిలో కాల్పుల కలకలం.. రూ. 6 లక్షలు అపహరించిన దుండగులు
Hyderabad | హైదరాబాద్ నగరంలోని కోఠిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 6 లక్షలు అపహరించి, కాల్పులు జరిపి పారిపోయారు దుండగులు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని కోఠిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 6 లక్షలు అపహరించి, కాల్పులు జరిపి పారిపోయారు దుండగులు. ఈ ఘటన శనివారం ఉదయం 7 గంటలకు చోటు చేసుకుంది.
కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రిషద్ అనే వ్యక్తి బయల్దేరాడు. అతన్ని ఫాలో అయిన దుండగులు.. ఏటీఎం వద్దకు రాగానే తుపాకీతో కాల్పులు జరిపారు. రిషద్ కాలికి బుల్లెట్ తగిలింది. దీంతో అతను కింద పడిపోయాడు. ఇక రిషద్ వద్ద ఉన్న రూ. 6 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు.

సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. రిషద్‌ను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిలో క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





