Suicide | స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తో ఉరేసుకున్న 9 ఏండ్ల బాలుడు..!
Suicide | స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తో ఓ 9 ఏండ్ల బాలుడు ఉరేసుకున్నాడు. ఈ ఘటన చందానగర్ పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే బాలుడు ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Suicide | హైదరాబాద్ : స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తో ఓ 9 ఏండ్ల బాలుడు ఉరేసుకున్నాడు. ఈ ఘటన చందానగర్ పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే బాలుడు ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శంకరంపేట మండలం కొల్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు శంకర్, పార్వతి కలిసి రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు..పెద్ద కొడుకు శివకుమార్, చిన్న కుమారుడు ప్రశాంత్(9) ఉన్నారు. ప్రశాంత్ స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇదే స్కూల్‌లో తండ్రి శంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
అయితే నిన్న స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ప్రశాంత్ స్కూల్ డ్రెస్‌తోనే నేరుగా బాత్రూంలోకి వెళ్లాడు. పది నిమిషాల తర్వాత కూడా బాత్రూం నుంచి బయటకు రాకపోవడంతో తల్లి పార్వతి అప్రమత్తమైంది. కుటుంబ సభ్యులందరూ కలిసి బాత్రూం తలుపులను బద్దలు కొట్టారు. కుమారుడు ప్రశాంత్ ఉరేసుకున్న దృశ్యం కనిపించడంతో తల్లిదండ్రులు షాకయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గోడలకు బాలుడి చేతి గుర్తులు..
బాత్రూం లోపల బట్టలు ఆరవేసుకోవడానికి అమర్చిన బైండింగ్ వైర్‌కి స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తో బాలుడు ఉరేసుకోగా, అతని చేతి గుర్తులు గోడలపై పడ్డాయి. బకెట్ కూడా బోర్లా పడి ఉంది. అంటే బకెట్‌పై నిలబడి ఉరేసుకుని ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు కుటుంబ సభ్యులు.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Honesty of an auto driver | ఆపరేషన్ డబ్బులు ఆటోలోనే మరిచాడు.. గంటల్లోనే బాధితుడికిచ్చేశారు
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



