Shamshabad Airport | శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..
Shamshabad Airport | త్రినేత్ర.న్యూస్: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) భారీగా గంజాయి పట్టుబడింది. కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమాన ప్రయాణికులకు కస్టమ్స్ సిబ్బంది తనిఖీ చేశారు.
Shamshabad Airport | త్రినేత్ర.న్యూస్: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) భారీగా గంజాయి పట్టుబడింది. కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమాన ప్రయాణికులకు కస్టమ్స్ సిబ్బంది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రయాణికుల నుంచి 9 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic Ganza) స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గంజాయిని ఎవరికి సప్లయ్ చేస్తున్నారని, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని ఆరా తీస్తున్నారు.
మరోవైపు భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న గ్యాంగ్ కార్యకలాపాలను ఈగిల్ ఫోర్స్ దర్యాప్తులో గుర్తించారు. ఎస్సార్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా డ్రగ్స్ తయారీలో ఉపయోగించే నిషేధిత రసాయనాలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మెఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 2 బ్రోమో-4 మెథైల్ ప్రోపియోఫీనోన్ అనే రసాయనంతో పాటు, క్లోఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 3 క్లోరో-1 ఫెనైల్-1 ప్రోపనోన్ అనే కెమికల్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఎస్సార్ ఇన్నోవేషన్స్ డైరెక్టర్ షేక్ రఫీ కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. ఇండియా మార్ట్ ద్వారా రాజస్థాన్‌కు చెందిన నిందితులకు ఈ రసాయనాలను సరఫరా చేసినట్లు వెల్లడించారు. తప్పుడు కంపెనీ పేర్లతో కెమికల్స్ కొనుగోలు చేసి షాద్‌నగర్‌లో కిరాయికి గదిని తీసుకుని అక్కడే డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తయారు చేసిన డ్రగ్స్‌ను తిరిగి రాజస్థాన్‌కు తరలించి విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






