త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shamshabad Airport | విమాన ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పార్క్ అండ్ ఫ్లై సేవ‌లు

Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టు విమాన ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త వినిపించింది. పార్కింగ్ క‌ష్టాల‌కు స్వ‌స్తి ప‌లికింది. పొరుగున ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల‌ను దృష్టిలో ఉంచుకుని పార్క్ అండ్ ఫ్లై సేవ‌ల‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

S

Hyderabad | Published On May 4, 2026, 11.15 am IST

Shamshabad Airport | విమాన ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పార్క్ అండ్ ఫ్లై సేవ‌లు
Advertisement

Shamshabad Airport | త్రినేత్ర‌.న్యూస్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు విమాన ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త వినిపించింది. పార్కింగ్ క‌ష్టాల‌కు స్వ‌స్తి ప‌లికింది. పొరుగున ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల‌ను దృష్టిలో ఉంచుకుని పార్క్ అండ్ ఫ్లై సేవ‌ల‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

ఈ సౌక‌ర్యం కింద ముందుగానే టూ వీల‌ర్, ఫోర్ వీల‌ర్‌తో పాటు బ‌స్సుల వంటి వాహ‌నాల‌ను ఎయిర్‌పోర్టులో పార్కింగ్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. వాహ‌న‌దారులు ముందస్తుగానే త‌మ పార్కింగ్ స్థ‌లాన్ని ఆన్‌లైన్‌లో రిజ‌ర్వ్ చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఎయిర్‌పోర్టు అఫిషీయ‌ల్ వెబ్‌సైట్ ద్వారా పార్కింగ్ ప్లేస్‌ను రిజ‌ర్వ్ చేసుకోవ‌చ్చు. త‌ద‌నంత‌రం స‌ద‌రు వాహ‌న‌దారుడి మెయిల్‌కు క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్ వ‌స్తుంది. ఎగ్జిట్ పాయింట్ 9, 10 వ‌ద్ద పార్కింగ్ ప్లేస్ ల‌భించ‌నుంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రోజురోజుకు పార్కింగ్ డిమాండ్ పెరిగిపోతోంది. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్ట‌ణం, తిరుప‌తి, రాజ‌మండ్రి వంటి ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పార్కింగ్ స‌దుపాయం క‌ల్పించిన‌ట్లు ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు.

పార్కింగ్ ఛార్జీలు ఇలా..

ఫోర్ వీల‌ర్స్‌కు 30 నిమిషాల‌కు రూ. 150(24 గంట‌ల‌కు రూ. 750)
టూ వీల‌ర్స్‌కు గంట‌కు రూ. 40(24 గంట‌ల‌కు రూ. 250)

వ్యాలెట్ పార్కింగ్‌

30 నిమిషాల‌కు రూ. 300(24 గంట‌ల‌కు రూ. 900)

6 గంట‌ల ముందే అడ్వాన్స్ బుకింగ్

ఇక శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పార్కింగ్ చేయ‌ద‌ల‌చుకున్న వాహ‌న‌దారులు 6 గంట‌ల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌తి బుకింగ్ కూడా 24 గంట‌ల వ‌ర‌కు గ‌డువు ఉంటుంది.

Advertisement
Advertisement