త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drugs | ఈగ‌ల్ టీమ్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన న‌టి హేమ‌.. డ్ర‌గ్స్ తీసుకోలేదంటూ వీడియో

Drugs | హైద‌రాబాద్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ (Drugs) క‌ల‌క‌లం సృష్టించాయి. కొండాపూర్‌లోని (Kondapur) క్వాక్ ఏరీనా పబ్‌లో (Quake Pub) డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్న‌ద‌నే స‌మాచారంతో స్థానిక పోలీసుల‌తో క‌లిసి ఈగ‌ల్ టీమ్ దాడులు నిర్వ‌హించింది.

G

Hyderabad | Published On Apr 3, 2026, 12.03 pm IST

Drugs | ఈగ‌ల్ టీమ్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన న‌టి హేమ‌.. డ్ర‌గ్స్ తీసుకోలేదంటూ వీడియో
Advertisement

Drugs | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ (Drugs) క‌ల‌క‌లం సృష్టించాయి. కొండాపూర్‌లోని (Kondapur) క్వాక్ ఏరీనా పబ్‌లో (Quake Pub) డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్న‌ద‌నే స‌మాచారంతో స్థానిక పోలీసుల‌తో క‌లిసి ఈగ‌ల్ టీమ్ దాడులు నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా అక్క‌డున్న 64 మందికి డ్ర‌గ్స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారిలో మొత్తం 8 మందికి పాజిటివ్ వ‌చ్చింది. ఆరుగురు గంజాయి సేవించ‌గా, మ‌రో ఇద్ద‌రు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు తేలింది. నిందితులంద‌రినీ అదుపులోకి తీసుకుని గ‌చ్చిబౌలి పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు.

అయితే దాడులు జ‌రిగిన స‌మ‌యంలో పబ్‌లో ప్ర‌ముఖ న‌టి హేమ (Actress Hema) కూడా అక్క‌డే ఉన్న‌ది. దీంతో ఆమెకు పోలీసులు డ్ర‌గ్స్ టెస్ట్ చేశారు. అందులో నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వ‌యంగా ప్ర‌క‌టించింది. ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మళ్లీ పబ్‌కి వచ్చాను.. ఇప్పుడే ఈగల్ టీం వాళ్లు చేసిన డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది’ అంటూ తన యూరిన్ టెస్ట్ రిపోర్ట్ చూపించింది. ‘మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదని.. రేపు మళ్లీ టెస్ట్ డ్రగ్స్ టెస్ట్‌కి సంబంధించిన మరో వీడియో పోస్ట్ చేస్తా’ అంటూ అందులో చెప్పింది. కాగా, పబ్ ప్రాంగణం నుంచే ఈ వీడియో రిలీజ్ చేయడం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గ‌తేడాది బెంగళూరులో జ‌రిగిన ఓ రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఆమె కొన్ని రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. అయితే ఆమెకు బెంగ‌ళూరు కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది.

Advertisement
Advertisement