త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siddaramaiah | సిద్ధ‌రామ‌య్య రాజీనామా.. డీకేకు లైన్ క్లియ‌ర్‌

Siddaramaiah | క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వ మార్పుపై గ‌త కొంత‌కాలంగా సాగుతున్న ప్ర‌చారానికి తెర‌ప‌డింది. ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య (Siddaramaiah) రాజీనామా చేశారు.

D

National | Published On May 28, 2026, 3.20 pm IST

Siddaramaiah | సిద్ధ‌రామ‌య్య రాజీనామా.. డీకేకు లైన్ క్లియ‌ర్‌
Advertisement

Siddaramaiah | క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వ మార్పుపై గ‌త కొంత‌కాలంగా సాగుతున్న ప్ర‌చారానికి తెర‌ప‌డింది. ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య (Siddaramaiah) రాజీనామా చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం డీకే శివ‌కుమార్ (DK Shivakumar)తో క‌లిసి లోక్ భ‌వ‌న్‌కు వెళ్లి త‌న రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. గ‌వ‌ర్న‌ర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో లేరు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఇండోర్ వెళ్ల‌డంతో.. సిద్ధూ త‌న రాజీనామా లేఖ‌ను రాజ్‌భ‌వ‌న్ కార్య‌ద‌ర్శికి అంద‌జేశారు. సిద్ధు రాజీనామాతో ముఖ్య‌మంత్రి అయ్యేందుకు డీకే శివ‌కుమార్‌కు అడ్డంకులు తొల‌గిపోయాయి. శ‌నివారం ఆయ‌న క‌ర్ణాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశం ఉంది.

ఢిల్లీకి సిద్ధూ..

ఇవాళ రాత్రి 7 గంట‌ల‌కు సిద్ధ‌రామ‌య్య ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు తెలిసింది. అక్క‌డ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవ‌కావం ఉంది. సిద్ధరామయ్య త‌న భవిష్యత్తు కార్యాచరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. సిద్ధ‌రామ‌య్య‌కు రాజ్య‌స‌భ సీటును పార్టీ నాయ‌క‌త్వం ఆఫ‌ర్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, అందుకు ఆయ‌న ఆస‌క్తి చూప‌డం లేద‌ని స‌మాచారం. ఈ రెండేళ్లూ ఎమ్మెల్యేగానే కొన‌సాగాల‌ని సిద్ధ‌రామ‌య్య నిర్ణ‌యించుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల టాక్‌.

డీకే ఇంటి వ‌ద్ద భ‌ద్ర‌త పెంపు..

ఇదిలా ఉండ‌గా.. శ‌నివారం నూత‌న ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌ని స‌మాచారం. క‌ర్ణాట‌క తదుప‌రి ముఖ్య‌మంత్రిగా డీకే శివ‌కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో డీకే ఇంటి వ‌ద్ద పోలీసులు భ‌ద్ర‌త‌ను పెంచారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. మ‌రోవైపు న‌గ‌రంలో డీకే పోస్ట‌ర్లు వెలిశాయి.

పవర్ షేరింగ్ ఫార్ములా..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత, సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య 'పవర్ షేరింగ్' (Power Sharing) ఒప్పందం జరిగిందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడంతో, ఇక డీకేఎస్‌కు ఛాన్స్ దక్కుతుందని ఆయన మద్దతుదారులు గట్టిగా నమ్మారు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత (Anti-incumbency) పెరుగుతోందని, ప్రియాంకా గాంధీ కూడా మార్పును కోరుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ చొర‌వ‌తోనే రాష్ట్రంలో నాయ‌క‌త్వ మార్పు జ‌రిగింద‌న్న ప్ర‌చారం ఊపందుకుంది.

Advertisement
Advertisement