Hyderabad | దొంగా దొంగా వస్తాడే.. అన్నీ దోచుకుపోతాడే..
Hyderabad | హైదరాబాద్ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
సంక్షిప్త సారాంశం
అతని వయసు 24 ఏండ్లే. కానీ గంజాయి, మద్యానికి బానిసగా మారాడు. అంతేకాదు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. దీంతో నగరంలో అర్ధరాత్రి వేళ చోరీలకు పాల్పడుతూ.. పలుమార్లు జైలు పాలయ్యాడు. తాజాగా చోరీ కేసులో పట్టుబడి మళ్లీ జైలుకెళ్లాడు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
ఇటీవలే ఆల్విన్ కాలనీలో కేటీఎం బైక్, మొబైల్ ఫోన్లు, శుభోదయ కాలనీలో టీవీఎస్ జుపిటర్ స్కూటీని చోరీ చేసినట్లు కేసు నమోదైంది. దీంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా.. సికింద్రాబాద్‌కు చెందిన మహ్మద్ సమీర్‌ఖాన్(24)ను అరెస్టు చేసి విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించాడు.
నిందితుడు మద్యం, గంజాయికి బానిసగా మారాడు. ఇక విలాసవంతమైన జీవితానికి డబ్బు కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. మాదాపూర్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, బేగంపేట్, అల్లాపూర్ ప్రాంతాల్లో పలుచోట్ల చోరీ కేసుల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించిట్లు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు.
నిందితుడి నుంచి శ్యాంసంగ్, ఒప్పో మొబైల్ ఫోన్లు, టీవీఎస్ జుపిటర్, కేటీఎం బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో పార్కు చేసిన వాహనాలను, లాక్ చేసిన ఇండ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





