Drugs | ఇంటీరియర్ డిజైన్ ముసుగులో డ్రగ్స్ దందా..
Hyderabad | హైదరాబాద్‌లో (Hyderabad) మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. కొండాపూర్‌లో (Kondapur) డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు (Excise Police) అరెస్టు చేశారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో (Hyderabad) మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. కొండాపూర్‌లో (Kondapur) డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు (Excise Police) అరెస్టు చేశారు. వారి నుంచి 6.09 గ్రాముల ఎండీఎంఏ (MDMA) స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మురళి అనే వ్యక్తిని ప్రధాన సరఫరాదారుగా గుర్తించిన అధికారులు, అతడు వికాస్, భరత్ చౌదరి అనే నిందితులకు డ్రగ్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.
ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం ముసుగులో ఈ అక్రమ దందా సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లగ్జరీ కార్లలో తిరుగుతూ నగరంలోని అవసరమైన వారికి క్షణాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. గ్రాముకు సుమారు రూ.5 వేలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
శంషాబాద్ విమానాశ్రయంలో..
మరో ఘటనలో శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గంజాయి (Ganja) సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ లగేజీ బ్యాగేజ్‌లో 3 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





