త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CEIR | మొబైల్‌ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన అత్తాపూర్‌ పోలీసులు

CEIR | కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్‌ (CEIR) పోర్టల్‌ సాయంతో అత్తాపూర్‌ పోలీసులు 25 పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను రికవరీ చేశారు. సుమారు రూ.2 లక్షల విలువైన ఈ ఫోన్లను బుధవారం బాధితులకు అందజేశారు.

P

Hyderabad | Published On Aug 19, 2026, 5.34 pm IST

CEIR | మొబైల్‌ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన అత్తాపూర్‌ పోలీసులు
Advertisement

CEIR | కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్‌ (CEIR) పోర్టల్‌ సాయంతో అత్తాపూర్‌ పోలీసులు 25 పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను రికవరీ చేశారు. సుమారు రూ.2 లక్షల విలువైన ఈ ఫోన్లను బుధవారం బాధితులకు అందజేశారు. అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ ఎ సీతయ్య బాధితులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి, ఫోన్లకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం వాటిని యజమానులకు అప్పగించారు. పోయాయని భావించిన తమ మొబైల్‌ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.

ఫోన్ల రికవరీలో కృషి చేసిన అత్తాపూర్‌ పోలీసులు, క్రైమ్‌ టీమ్‌ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ సీతయ్య మాట్లాడుతూ మొబైల్‌ ఫోన్‌ పోయినా, చోరీకి గురైనా ప్రజలు ఆందోళన చెందకుండా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌ను సీఈఐఆర్‌లో బ్లాక్‌ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని అడ్డుకోవడంతోపాటు, ఫోన్‌ను గుర్తించి రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజు నాయక్‌తో పాటు క్రైమ్‌ టీమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement