త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi Sarovar Project | గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు.. భారీ వృక్షాలు న‌రికివేత‌

Gandhi Sarovar Project | ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల మ‌ధ్య గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి వ‌డివ‌డిగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీ న‌ది ఉప‌న‌ది అయిన ఈసీ న‌ది క‌లిసే చోట.. గురువారం అధికారులు గ్రౌండ్ లెవ‌లింగ్ ప‌నులు నిర్వ‌హించారు.

S

Hyderabad | Published On Feb 27, 2026, 6.27 am IST

Gandhi Sarovar Project | గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు.. భారీ వృక్షాలు న‌రికివేత‌
Advertisement

Gandhi Sarovar Project | త్రినేత్ర‌.న్యూస్ : ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల మ‌ధ్య గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి వ‌డివ‌డిగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసేందుకు అధికార యంత్రాంగం స్థ‌లాన్ని ఎంపిక చేయ‌డంతో.. గండిపేట మండ‌లం, మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ అధికారులు ప‌రుగులు పెడుతున్నారు.

మూసీ న‌ది ఉప‌న‌ది అయిన ఈసీ న‌ది క‌లిసే చోట.. గురువారం అధికారులు గ్రౌండ్ లెవ‌లింగ్ ప‌నులు నిర్వ‌హించారు. ఆ ప్రాంతంలో ఉన్న ద‌శాబ్దాల కాలం నాటి భారీ వృక్షాల‌ను తొల‌గించారు. అయితే మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులు ఈ ప్రాజెక్టును వ్య‌తిరేకిస్తున్న‌ప్ప‌టికీ, వారి ఆందోళ‌న‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి.. అధికారులు ప‌నులు ప్రారంభించారు.

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు వేగ‌వంతం చేయాల‌ని ఉన్న‌తాధికారుల నుంచి త‌మ‌కు ఆదేశాలు అందాయ‌ని గండీపేట మండ‌లం, ఎంఆర్‌డీసీఎల్ అధికారులు అధికారికంగా ధృవీక‌రించారు. అయితే శంకుస్థాన తేదీ ఖ‌రారు కాన‌ప్ప‌టికీ నేల చ‌దును చేయాల‌ని, అక్క‌డున్న భారీ వృక్షాల‌ను తొల‌గించాల‌ని త‌మ‌కు ఆదేశాలు అందాయ‌న్నారు. ఈ క్ర‌మంలోనే ప‌నులు మొద‌లుపెట్టిన‌ట్లు పేర్కొన్నారు.

ఇటీవ‌లే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంద‌ర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్ప‌టికీ రాజ్‌నాథ్ సింగ్ ప‌ర్య‌ట‌న‌పై ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు.

మ‌ధు పార్కు రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల ఆందోళ‌న‌

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు వ‌ల్ల తాము నిరాశ్ర‌యులం అవుతున్నామ‌ని మ‌ధు పార్కు రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులు ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్ వాసుల‌కు ఆయా రాజ‌కీయ పార్టీల నేత‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. గాంధీ విగ్ర‌హానికి తాము వ్య‌తిరేకం కాదు. కానీ మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద‌ల నివాసాల‌ను కూల్చ‌కుండా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement
Advertisement