త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | గురుకులంలో ఫుడ్ పాయిజ‌న్.. 16 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌

Hyderabad | రాష్ట్రంలోని గురుకుల పాఠ‌శాల‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రి చూపిస్తుంది. ప్ర‌తి రోజు ఏదో ఒక గురుకులంలో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతూనే ఉన్నారు.

S

Hyderabad | Published On Dec 12, 2025, 4.10 pm IST

Hyderabad | గురుకులంలో ఫుడ్ పాయిజ‌న్.. 16 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌
Advertisement

Hyderabad | హైద‌రాబాద్ : రాష్ట్రంలోని గురుకుల పాఠ‌శాల‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రి చూపిస్తుంది. ప్ర‌తి రోజు ఏదో ఒక గురుకులంలో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతూనే ఉన్నారు. ప‌లువురు విద్యార్థులు కూడా మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లు చూశాం.

తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని తిల‌క్ న‌గ‌ర్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న వెలుగు చూసింది. గురువారం రాత్రి భోజ‌నం చేసిన అనంత‌రం ప‌లువురు విద్యార్థినులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వాంతులు, విరేచ‌నాల‌తో బాధ‌ప‌డుతున్న 16 మంది విద్యార్థినుల‌ను చికిత్స నిమిత్తం కింగ్ కోఠి గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. బాధిత విద్యార్థినుల‌కు చికిత్స కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. వారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

అన్నంలో పురుగులు వ‌స్తున్నాయ్..

అన్నంలో పురుగులు వ‌స్తున్నాయ్.. నీళ్ల చారు పోస్తున్నారు. మెనూ పాటించ‌డం లేదు. అడిగితే కొడుతున్నారు. శిథిల భ‌వ‌నంలో స‌మ‌స్య‌ల మ‌ధ్య భ‌య‌భ‌యంగా ఉంటున్నాం అంటూ శామీర్‌పేట‌లోని గురుకుల పాఠ‌శాల విద్యార్థులు నిన్న పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. సుమారు 50 మంది విద్యార్థులు గురువారం 2 కిలోమీట‌ర్లు న‌డిచి శామీర్‌పేట పోలీసుల‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించారు. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను పోలీసులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంత‌రం విద్యార్థుల‌ను పోలీసులు గురుకుల పాఠ‌శాల‌కు తీసుకెళ్లారు.

Advertisement

తాజావార్తలు

Advertisement