Nepali Gang | గచ్చిబౌలిలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ.. కిలో బంగారం ఆభరణాలు, వజ్రాలు మాయం
Nepali Gang | మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను (Nepali Gang) అరెస్టు చేసి నాలుగు రోజులు గడువకముందే మరో ముఠా భారీ గచ్చిబౌలిలో (Gachibowli) చోరీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కిలో బంగారు ఆభరణాలు, వజ్రాలను ఎత్తుకెళ్లారు.
Nepali Gang | త్రినేత్ర.న్యూస్: మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను (Nepali Gang) అరెస్టు చేసి నాలుగు రోజులు గడువకముందే మరో ముఠా భారీ గచ్చిబౌలిలో (Gachibowli) చోరీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కిలో బంగారు ఆభరణాలు, వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నేపాలీ దంపతులు నెల రోజుల క్రితమే వ్యాపారవేత్త ఇంట్లో పనిలో చేరారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లింది. ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు కనిపించకుండా పోయారు. ఇంటి తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో వారు చెప్పకుండా వెళ్లిపోయారని వ్యాపార వేత్త భావించారు. అయితే పూజ గదిలో విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతో పాటు ఇంట్లోని మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు ద్యాప్తు చేస్తున్నారు.
కాగా, నెల మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. లక్షల రూపాయల విలువైన నగలు, నగదు, ఇతర వస్తువులను అపహరించింది. ఈ కేసులో ఇద్దరు కీలక సూత్రధారులను గతంలోనే అరెస్టు చేసిన పోలీసులు, ఈ నెల 4న మరో నలుగురిని పుణెలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు సభ్యు ముఠా ముఠా దేశంలోని వివిధ నగరాల్లో చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
- ●Samajwadi Party | తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్ జోష్.. వరుసగా లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు
- ●Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్
- ●Social Media | సోషల్ మీడియా కంటెంట్‌తో 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతం.. మెటా, టిక్‌టాక్‌పై కుటుంబాల న్యాయ పోరాటం..
- ●Alpha Trailer | అదిరిన ‘ఆల్ఫా’ ట్రైలర్.. యాక్షన్ మోడ్‌లో అలియా

Samajwadi Party | తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?

Stock Markets | స్టాక్ మార్కెట్ జోష్.. వరుసగా లాభాల్లో ముగిసిన సూచీలు..

Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు

Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్






