త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Salar Jung Museum | గ‌జ‌ల్స్‌తో మార్మోగిన సాలార్‌జంగ్ మ్యూజియం.. ల‌లిత ఆనంద్ గానానికి శ్రోత‌లు ఫిదా

Salar Jung Museum | సాలార్ జంగ్ మ్యూజియం 75వ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన గజల్ సంగీత కార్యక్రమం సంగీతాభిమానులను ఆకట్టుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యూజియం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని లలిత ఆనంద్ గజల్స్ ఆలపించి శ్రోతలను అలరించారు. కా

P

Hyderabad | Published On Jun 16, 2026, 10.05 pm IST

Salar Jung Museum | గ‌జ‌ల్స్‌తో మార్మోగిన సాలార్‌జంగ్ మ్యూజియం.. ల‌లిత ఆనంద్ గానానికి శ్రోత‌లు ఫిదా
Advertisement

Salar Jung Museum | సాలార్ జంగ్ మ్యూజియం 75వ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన గజల్ సంగీత కార్యక్రమం సంగీతాభిమానులను ఆకట్టుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యూజియం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని లలిత ఆనంద్ గజల్స్ ఆలపించి శ్రోతలను అలరించారు. కార్యక్రమంలో భాగంగా ఆమె ‘రంజిష్ హీ సహీ’, ‘ఏ కుచ్ అబ్ర్’, ‘ఖాతిల్ తే ఐత్బార్’, ‘ఝుకీ ఝుకీ సీ నజర్’, ‘ఆజ్ జానే కీ జిద్ నా కరో’ వంటి ప్రసిద్ధ గజల్స్‌ను ఆలపించారు. ముఖ్యంగా ‘ఝుకీ ఝుకీ సీ నజర్’, ‘ఆజ్ జానే కీ జిద్ నా కరో’ గీతాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

సంగీత, సాహిత్య, కళారంగాలకు చెందిన ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు కార్యక్రమానికి హాజరయ్యారు. చివరి వరకు ఆసక్తిగా కార్యక్రమాన్ని వీక్షిస్తూ గజల్ సంగీతాన్ని ఆస్వాదించారు. కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కార్య‌క్ర‌మానికి మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాలార్ జంగ్ మ్యూజియం దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సంగీతం, కళలు, సాహిత్య పరిరక్షణకు దోహదపడటమే కాకుండా యువతలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ గజల్ సంగీత విభావరి, సాలార్ జంగ్ మ్యూజియం సాంస్కృతిక వైభవాన్ని మరోసారి ప్రతిబింబించిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ముగింపులో కళాకారులను సత్కరించి, అతిథులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement