త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Predictions | 2029లో ఏర్ప‌డ‌నున్న ఆరు గ్ర‌హ‌ణాలు.. మళ్లీ 2020 తరహా సంక్షోభానికి సంకేతమేనా..?

Predictions | 2020 సంవ‌త్స‌రం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ సంవ‌త్స‌రంలో ఎన్నో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది. ముఖ్యంగా క‌రోనా మ‌హ‌మ్మారి విరుచుకుప‌డింది. ల‌క్ష‌ల్లో జ‌నం వైర‌స్‌కు బ‌ల‌య్యారు. లాక్‌డౌన్ లాంటి ప‌రిస్థితుల‌తో తీవ్ర ఇబ్బందులుప‌డ్డారు.

P

Horoscope | Published On Feb 21, 2026, 6.25 pm IST

Predictions | 2029లో ఏర్ప‌డ‌నున్న ఆరు గ్ర‌హ‌ణాలు.. మళ్లీ 2020 తరహా సంక్షోభానికి సంకేతమేనా..?
Advertisement

Predictions | 2020 సంవ‌త్స‌రం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ సంవ‌త్స‌రంలో ఎన్నో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది. ముఖ్యంగా క‌రోనా మ‌హ‌మ్మారి విరుచుకుప‌డింది. ల‌క్ష‌ల్లో జ‌నం వైర‌స్‌కు బ‌ల‌య్యారు. లాక్‌డౌన్ లాంటి ప‌రిస్థితుల‌తో తీవ్ర ఇబ్బందులుప‌డ్డారు. ఆ త‌ర్వాత ఆర్థిక మాంద్యం నెల‌కొంది. వేలాది మంది ఉద్యోగులు రోడ్డున ప‌డ్డారు. అలాగే, దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే, త్వ‌ర‌లోనే ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. 2029 సంవ‌త్స‌రంలో ఆరు గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డ‌బోతున్నాయి. దాంతో ప్ర‌కృతి మార్పులు, రాజ‌కీయ రంగాల్లో భారీ మార్పుల‌కు సంకేతంగా జ్యోతిష‌శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. 2020 సంవ‌త్స‌రంలోనూ ఆరు గ్ర‌హణాలు ఏర్ప‌డ్డాయి. అదే స‌మ‌యంతో కొవిడ్ మ‌హమ్మారి ప‌రిస్థితులు, లాక్‌డౌన్‌, ఆర్థిక మాంద్యం, తూర్పు ల‌ద్దాక్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌-చైనా ఘ‌ర్ష‌ణ‌, చిన్న యుద్ధాలు, ప‌లు దేశాల్లో ప్రజా తిరుగుబాట్లు ప్రపంచ ఆలోచనా విధానాన్ని, పరిస్థితులను పూర్తిగా మార్చేశాయి. ఆ ప‌రిస్థితులు ఇంకా చ‌క్క‌బ‌డ‌నే లేదు. 2029లోనూ ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉన్న‌ది. అయితే, గ్ర‌హాల సంచారం ఒకేలా ఉండ‌క‌పోయినా తీవ్ర‌స్వ‌భావం కొన‌సాగే అవ‌కాశం ఉంటుంద‌ని పండితులు పేర్కొంటున్నారు.

2020లో గ్ర‌హాల సంచారం..

2020 జ‌న‌వ‌రి 24న శ‌ని త‌న సొంత రాశిలోకి ప్ర‌వేశించాడు. ఇది ఆ సంవ‌త్స‌రంలో అతిపెద్ద జ్యోతిష సంఘ‌ట‌న‌. శ‌ని న్యాయం, శ‌క్తికి సంకేతంగా భావిస్తారు. దాంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాత వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలాయి. ఫ‌లితంగా జ‌నం స్వీయ నియంత్ర‌ణ నేర్చుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మార్చి చివ‌ర‌లో గురువు సైతం మ‌క‌ర రాశిలోకి ప్ర‌వేశించాడు. ఇప్ప‌టికే శ‌ని అదేరాశిలో ఉండ‌డంతో గురువు-శ‌ని క‌ల‌యిక భారీ విప‌త్తులు, ప్ర‌పంచ మార్పుల‌కు సంకేతంగా భావిస్తారు. మ‌హ‌మ్మారి వ్యాప్తి, ఆర్థిక మాంద్యానికి ప్ర‌ధాన కార‌ణంగా జ్యోతిష‌శాస్త్రం పేర్కొంది. గురువు వ‌క్ర‌గ‌తితో ఆ సంవ‌త్స‌రంలో రెండుసార్లు రాశిని మార్చుకున్నాడు. గురువు నీచ‌రాశిలో ఉన్న స‌మ‌యంలో ఆరోగ్య సేవ‌లు తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆక్సిజ‌న్‌, శ్వాస‌కోశ సంబంధిత వ్యాధులు గ‌రిష్ఠ స్థాయికి చేరాయి. అదే ఏడాది సెప్టెంబ‌ర్ 23న రాహువు మిథునం నుంచి వృష‌భంలోకి, కేతువు ధ‌నుస్సు నుంచి వృశ్చిక రాశిలోకి ప్ర‌వేశించాడు. వృషభంలోకి రాహు ప్రవేశించడం స్టాక్ మార్కెట్‌లో భారీ మార్పులు, ప్రజల జీవనశైలిలో ఆకస్మిక పరిణామాలకు దారితీసింది. దాంతో వైద్యం, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో కొత్త యుగానికి నాంది పలికింది. దాని ఫ‌లితాలు నేటికీ క‌నిపిస్తూనే ఉన్నాయి.

2020లో ఆరు గ్ర‌హ‌ణాలు

జనవరి 10 – చంద్రగ్రహణం
జూన్ 5 – చంద్రగ్రహణం
జూన్ 21 – సూర్యగ్రహణం
జూలై 5 – చంద్రగ్రహణం
నవంబర్ 30 – చంద్రగ్రహణం
డిసెంబర్ 14 – సూర్యగ్రహణం

2020లో శని, గురు, రాహు, కేతు ప్రభావం గ్రహణాల ప్రభావం కలిసి ప్రపంచాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేశాయి. దాదాపు అన్నిరంగాల్లో ఒకేసారి భారీ మార్పులు క‌నిపించాయి. ప్రపంచం మొత్తం స్తంభించి, పాత విధానాల‌కు స్వ‌స్తి చెప్పి.. కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకురావాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. శ‌ని క‌ర్మ‌ఫ‌లాన్ని ఇచ్చాడు. గురువు క‌ఠిన ప‌రిస్థితుల్లో ఎలా జీవించాలో మానవాళికి నేర్పించాడు. ఇది అంద‌రికీ అవ‌స‌ర‌మేన‌ని.. ఎందుకంటే రాబోయే కాలం ఇంకా కఠినంగా ఉండబోతోంది. 2020 నుంచి పాఠాలు నేర్చుకోని వారు మళ్లీ కఠిన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

2029లో కీల‌క గ్ర‌హాల సంచారం..

2029లో శని మేషంలో (నీచ రాశి), గురు తులాలో, రాహు-కేతు అక్షం ధనుస్సు-మిథునంలో ఉండడం అత్యంత ప్ర‌భావ‌వంతంగా ఉండ‌నున్న‌ది. 2027లోనే శని మేషంలోకి ప్ర‌వేశిస్తాడు. వ‌క్ర‌గ‌తిలో మ‌ళ్లీ మీనంలోకి వెళ్లి 2028లో తిరిగి మేష‌రాశిలోకి వ‌స్తాడు. 2029లో వృష‌భంలోకి ప్ర‌వేశించి.. మ‌ళ్లీ మేష‌రాశిలోకి వ‌స్తాడు. మేషం (అగ్ని తత్వం, కుజుని రాశి)లో శని నీచంగా ప‌రిగ‌ణిస్తారు. ఈ స‌మ‌యంలో శ‌నైశ్చ‌రుడు ప్ర‌తి ఒక్క‌రి క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ప‌రిక్షిస్తాడు. 2020 సంవ‌త్స‌రం నుంచి పాఠాలు నేర్చుకోని వారంతా మ‌ళ్లీ ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాలనా వ్యవస్థలు, నాయకత్వంపై అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. సైన్యం, పోలీసు బలగాలపై ఒత్తిడి పెరుగుతుంది.

శని, కుజుడితో ఏ రూపంలోనైనా సంయోగం జ‌రిగిన‌ప్పుడు యుద్ధాలు సంభ‌వించాయి. 1999లో కార్గిల్ యుద్ధ స‌మ‌యంలోనూ శ‌ని మేషంలో సంచ‌రించాడు. 1969లో చైనా-సోవియ‌ట్‌ మ‌ధ్య ఘర్ష‌ణ సైతం జ‌రిగింది. శక్తి సంక్షోభం, అగ్ని సంబంధిత భారీ ప్ర‌మాదాలు పెరిగే అవ‌కాశాలున్నాయి. జ‌నంలో ఓర్పు తగ్గి, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. గురు ఆగ్రహ స్వభావంతో సంచరిస్తూ శనిపై నియంత్రణ తగ్గిస్తుంది. 2029 మార్చిలో గురు కన్యలోకి, ఆగస్టులో తులారాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో గురు సంచారం అంత శుభ‌క‌ర‌మైందిగా భావించ‌రు. ఎందుకంటే బుధుడు శ‌త్రువు గ్ర‌హం. తులరాశిలో శుక్రుడి రాశిలో గురువు ఉండ‌డం వ్యాపారం, సంబంధాల విష‌యంలో అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంది. దేశాల మ‌ధ్య కొత్త వాణిజ్య ఒప్పందాలు జ‌రిగుతాయి. విలాసాలు, ఫ్యాష‌న్ రంగాల్లో వృద్ధి ఉంటుంది. మహిళల హక్కులు, వివాహ చట్టాల్లో గ్లోబల్ స్థాయిలో భారీ మార్పులు క‌నిపించే సూచ‌న‌లు గోచ‌రిస్తున్నాయి. శని ఉగ్రతను సమతుల్యం చేయడానికి గురు ప్ర‌య‌త్నం చేసే అవ‌కాశం ఉండ‌డంతో యుద్ధ ప‌రిస్థితులు కొంత వ‌ర‌కు నివారించే సూచ‌న‌లున్నాయి.

ధ‌నుస్సురాశిలో రాహువు.. మిథునంలో కేతువు..

ధ‌నుస్సురాశిలో రాహువు సంచారంతో ఆధ్యాత్మిక‌, మ‌త‌, ఉన్న‌త విద్యారంగాల్లో గంద‌ర‌గోళం, తీవ్ర‌వాద ధోర‌ణులు పెరిగే అవ‌కాశాలున్నాయి. అచార వ్య‌వ‌హారాల‌ను కొంద‌రు స‌వాల్ చేస్తారు. విదేశీ వాణిజ్యంలో ఆక‌స్మిక లాభాలు క‌లిగే సూచ‌న‌లున్నాయి. మిథునంలో కేతువు సంచారంతో స‌మాచారం రంగంలో అంత‌రాయం, పూర్తిగా కొత్త సాంకేతిక‌త‌లు వెలుగులోకి వ‌స్తాయి. ర‌చ‌న‌, జ‌ర్న‌లిజం విష‌యంలోనూ కీల‌క మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి.

2029లో ఆరు గ్ర‌హ‌ణాలు

2029లో ఆరు గ్ర‌హ‌ణాలు క‌నిపించ‌నున్నాయి. ఇందులో నాలుగు సూర్య‌గ్ర‌హ‌ణాలు కాగా.. రెండు చంద్ర‌గ్ర‌హ‌ణాలు ఉన్నాయి.

జనవరి 14న సూర్యగ్రహణం
జూన్ 12న సూర్యగ్రహణం
జూన్ 25న సంపూర్ణ చంద్రగ్రహణం
జూలై 11న సూర్యగ్రహణం
డిసెంబర్ 5న సూర్యగ్రహణం
డిసెంబర్ 20–21న సంపూర్ణ చంద్రగ్రహణం

2020-2029కి మ‌ధ్య పోలిక‌లు..

2020: శని, గురు, రాహు, కేతు ప్రభావం ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. 2029లోనూ ఇలాంటి ప్రభావాలు కనిపించే సూచనలు ఉన్నాయి. 2020లో మకరంలో శని ప్రవేశం పాత వ్యవస్థల పతనానికి దారితీసింది. ఇక 2029లో మేషంలో శ‌ని నీచ‌స్థానంతో ప్ర‌తి ఒక్క‌రి క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ప‌రీక్షించ‌నున్నాడు. 2020లో గురు-శ‌ని సంయోగం ఆర్థిక మాంద్యానికి కార‌ణంగా పండితులు పేర్కొన్నారు. 2029లో ఆర్థిక వ్యవస్థ అస్థిరమ‌య్యే అవ‌కాశం ఉంది. శ‌ని వ్య‌వ‌స్థ‌ల‌ను కుదిపేయ‌నున్నాడు. అయితే, గురువు ప్ర‌భావంతో కొంత స‌మ‌తుల్య‌త ఉండే ఛాన్స్ ఉంది. 2020లో గాల్వాన్ లోయ‌లో ఘ‌ర్ష‌ణ‌, చిన్న‌పాటి యుద్ధాలు చోటు చేసుకున్నాయి. 2029లో మేషంలో శ‌ని స్థానం కార‌ణంగా పెద్ద యుద్ధ ప‌రిస్థితుల‌కు దారి తీసే అవ‌కాశం ఉంది. ప్ర‌పంచ భౌగోలిక ప‌రిస్థితుల్లో మార్పులు సంభ‌వించే ప్ర‌మాదం ఉంది. 2027, 2028లో ఇలాంటి ప‌రిస్థితులు క‌నిపించే సూచ‌న‌లున్నాయి. 2020లో మ‌క‌రంలో గురువు బ‌ల‌హీన‌మైన‌ప్పుడు కొవిడ్ మ‌హ‌మ్మారితో శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. దాంతో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. 2029లో మేషంలో శ‌ని నీచ స్థితిలో ఉండ‌డంతో మ‌ళ్లీ కొవిడ్ లాంటి మ‌హ‌మ్మారులు వ‌చ్చే ప్ర‌మాదం జ్యోతిష పండితులు అంచ‌నా వేస్తున్నారు. 2020లో మొత్తం ఆరు గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో రెండు, నాలుగు చంద్రగ్రహణాలున్నాయి. 2029లోనూ మొత్తం నాలుగు సూర్య‌, రెండు చంద్ర‌గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డ‌నున్నాయి. 2020లో మిష‌న్ మార్స్‌తో పాటు వ్యాక్సిన్ త‌యారీ,  సాంకేతిక రంగాల్లో కొత్త ట్రెండ్ మొద‌ల‌య్యింది. 2029లో రాహువు-కేతు ప్ర‌భావంతోనూ స్పేస్ సెక్టార్‌లోనూ కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు చూసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా.

Advertisement
Advertisement