త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Legionnaires Disease | న్యూయార్క్‌లో విజృంభిస్తున్న లెజియోనెయర్స్ వ్యాధి.. అస‌లేంటిది.. ఎలా వ్యాపిస్తుంది..

Legionnaires Disease | అమెరికాలోని న్యూయార్క్ నగరంలో లెజియోనెయర్స్ వ్యాధి వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. మాన్‌హాటన్‌లోని అప్పర్ ఈస్ట్ సైడ్ ప్రాంతంలో నమోదైన ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి మరో వ్యక్తి మృతి చెందినట్లు న్యూయార్క్ సిటీ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. దీంతో ఈ వ్యాధి కారణంగా మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది.

S

Health | Published On Jul 20, 2026, 3.40 pm IST

Legionnaires Disease | న్యూయార్క్‌లో విజృంభిస్తున్న లెజియోనెయర్స్ వ్యాధి.. అస‌లేంటిది.. ఎలా వ్యాపిస్తుంది..
Advertisement

Legionnaires Disease | అమెరికాలోని న్యూయార్క్ నగరంలో లెజియోనెయర్స్ వ్యాధి వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. మాన్‌హాటన్‌లోని అప్పర్ ఈస్ట్ సైడ్ ప్రాంతంలో నమోదైన ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి మరో వ్యక్తి మృతి చెందినట్లు న్యూయార్క్ సిటీ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. దీంతో ఈ వ్యాధి కారణంగా మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 72 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ సిటీ హెల్త్ కమిషనర్ డాక్టర్ అలిస్టర్ ఎఫ్. మార్టిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పర్ ఈస్ట్ సైడ్‌లో లెజియోనెయర్స్ వ్యాధి కారణంగా మరో న్యూయార్క్ వాసి ప్రాణాలు కోల్పోయిన విషయం త‌మ‌కు తీవ్ర విచారం కలిగించింద‌న్నారు.

లెజియోనెయ‌ర్స్ అంటే..

లెజియోనెయర్స్ వ్యాధి అంటే.. తీవ్రమైన న్యూమోనియా రూపం. ఇది వేడి, నిల్వగా ఉండే నీటిలో పెరిగే లెజియోనెల్లా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పెద్ద భవనాల్లోని ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలకు సంబంధించిన కూలింగ్ టవర్లను ఆరోగ్య అధికారులు విస్తృతంగా పరీక్షిస్తున్నారు. పరీక్షల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిన కూలింగ్ టవర్లను వెంటనే ఖాళీ చేసి, పూర్తిగా శుభ్రపరిచి క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని భవన యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత వ్యాధి వ్యాప్తికి క‌చ్చితమైన మూలాన్ని అధికారులు ఇంకా గుర్తించలేకపోయినప్పటికీ, కొత్త కేసుల సంఖ్య నిరంతరం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. దీంతో లెజియోనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమైన మూలాన్ని ఇప్పటికే తొలగించి ఉండే అవకాశముందని ఆరోగ్య శాఖ భావిస్తోంది.

గ‌తేడాది కూడా ఇలాగే..

అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపిన ప్రకారం లెజియోనెయర్స్ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ వ్యాధి బారిన పడిన వారిలో సుమారు 10 శాతం మంది సంక్లిష్టతల కారణంగా మరణించే ప్రమాదం ఉంటుంద‌ని తెలిపింది. గతేడాది కూడా న్యూయార్క్‌లోని హార్లెమ్ ప్రాంతంలో లెజియోనెయర్స్ వ్యాధి వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగించింది. ఆ సమయంలో 100 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement