Weekend Drinking | వారం మొత్తం తాగకుండా వీకెండ్లోనే మద్యం సేవిస్తున్నారా..? అయితే జాగ్రత్త..!
Weekend Drinking | చాలా మంది వీకెండ్లలో మాత్రమే తాగుతున్నాం కదా, వారంరోజులు అసలు మద్యం ముట్టుకోం.. అని భావిస్తుంటారు. ఇలా చేయడం బాధ్యతాయుతంగా ఉందన్న భావన కూడా చాలామందిలో ఉంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు నియంత్రణ, శనివారం రాగానే పార్టీలు, స్నేహితులతో మద్యం.. ఇదే కొత్త జీవనశైలి అయింది.
Weekend Drinking | చాలా మంది వీకెండ్లలో మాత్రమే తాగుతున్నాం కదా, వారంరోజులు అసలు మద్యం ముట్టుకోం.. అని భావిస్తుంటారు. ఇలా చేయడం బాధ్యతాయుతంగా ఉందన్న భావన కూడా చాలామందిలో ఉంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు నియంత్రణ, శనివారం రాగానే పార్టీలు, స్నేహితులతో మద్యం.. ఇదే కొత్త జీవనశైలి అయింది. కానీ మద్యం విషయంలో క్యాలెండర్‌కు కాదు, శరీరంపై పడే భారానికే అసలు ప్రాధాన్యం ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మద్యం శరీరంలోకి వెళ్లిన ప్రతిసారి అది తప్పకుండా కాలేయం (లివర్) గుండా వెళ్లాల్సిందే. శరీరం నుంచి విషపదార్థాలను తొలగించడమే కాలేయం ప్రధాన పని. అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే, అంటే బింజ్ డ్రింకింగ్ చేస్తే, కాలేయంపై ఒక్కసారిగా భారీ భారం పడుతుంది. కాలేయం బలమైన అవయవమే అయినా, ప్రతిసారి ఇలాగే భారం పడితే త్వరగా కోలుకునే శక్తి తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
ఎంత మోతాదు అన్నదే ముఖ్యం..
రోజూ తాగడం కంటే వీకెండ్లలో మాత్రమే తాగితే పెద్ద సమస్య కాదన్న భావన సమాజంలో బలంగా ఉంది. ఇది ఒక రకంగా సేఫ్ లూప్‌హోల్ లాగా మారింది. ఆఫీస్ ఒత్తిడి, వారాంతపు రిలాక్సేషన్, పుట్టినరోజులు, పెళ్లిళ్లు, బ్రంచ్ పార్టీలు.. అన్నింటికీ మద్యం భాగమవుతోంది. శుక్రవారం రాత్రి మొదలై, శనివారం రాత్రి వరకు, కొన్నిసార్లు ఆదివారం కూడా కొనసాగుతోంది. ఈ విషయంపై సాకేత్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ విభాగం ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ పల్లవి గార్గ్ మాట్లాడుతూ, ఎన్ని రోజులు తాగడం మానేశామన్నది కాదు, ఒకేసారి ఎంత మోతాదులో, ఎంత వేగంగా తాగామన్నదే కాలేయానికి ఎక్కువ నష్టం చేస్తుంది. వారంలో ఐదు రోజులు మానేసినా, వీకెండ్లో మోతాదుకు మించి తాగితే కాలేయం దెబ్బతింటుంది, అని ఆమె హెచ్చరించారు.

అధికమవుతున్న బింజ్ డ్రింకింగ్..
చాలా మంది కొన్ని రోజులు తాగకపోతే లివర్ పూర్తిగా రిపేర్ అవుతుందని అనుకుంటారు. ఇది పూర్తిగా నిజం కాదని ఆమె చెప్పారు. అలాగే వైన్ లేదా ఖరీదైన మద్యం తాగితే సురక్షితం అన్న అపోహ కూడా ఉంది. బింజ్ డ్రింకింగ్ అనేది కాలేజ్ యువత సమస్య మాత్రమే కాదు, ఉద్యోగులు, వ్యాపారులు, మధ్య వయస్సు వారిలో కూడా ఇది విస్తృతంగా కనిపిస్తోంది. డాక్టర్ పల్లవి గార్గ్ తెలిపిన ప్రకారం.. వీకెండ్లో మళ్లీ మళ్లీ లివర్ పై ఒత్తిడి పడుతుంటే, వారంలో తాగని రోజులలో ఆ నష్టాన్ని తగ్గించలేము. ఇది మొత్తం మద్యం ప్రభావాన్ని కొంత తగ్గించవచ్చు కానీ, బింజ్ డ్రింకింగ్ వల్ల వచ్చే దుష్ప్రభావాన్ని మాత్రం తగ్గించలేదు. ఇలా కొనసాగితే కాలేయంలో ఫైబ్రోసిస్ (కణజాలం గట్టిపడటం) ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇది ముఖ్యంగా యువ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఆమె తెలిపారు.
హై రిస్క్ జోన్లో ఉంటే..
ఇప్పటికే ఊబకాయం, షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు, హెపటైటిస్ బి లేదా సి వంటి కాలేయ వ్యాధులు ఉన్నవారు, మహిళలు, కుటుంబంలో కాలేయ వ్యాధుల చరిత్ర ఉన్నవారు.. వీరందరికీ వీకెండ్ బింజ్ డ్రింకింగ్ వల్ల కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణ బరువు ఉన్నవారికి లేదా ఇతర సమస్యలు లేనివారికి ప్రమాదం లేదని అర్థం కాదు. కానీ పై వర్గాల వారికి ముప్పు మరింత తీవ్రమని నిపుణులు చెబుతున్నారు. బింజ్ డ్రింకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హై రిస్క్ జోన్లో ఉన్నవారు క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ టెస్ట్, అబ్డొమెన్ అల్ట్రాసౌండ్, ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఏ చిన్న అనుమానం వచ్చినా హెపటాలజిస్ట్ను సంప్రదించాలని డాక్టర్ పల్లవి గార్గ్ సూచించారు.
మొత్తంగా చెప్పాలంటే వారం అంతా తాగడం లేదు కదా, వారాంతంలోనే తాగుతున్నాం కదా అని భావించకూడదు. అలా తాగినా కూడా మోతాదులోనే తాగాలి. వారం మొత్తం తాగలేదని చెప్పి ఆ కోటాను పూర్తిగా ఒకే రోజులో లేదా వీకెండ్లో ముగించడం చేయకూడదు. అలా చేస్తే రోజూ తాగిన దాని కన్నా ఇంకా ఎక్కువగా నష్టం కలుగుతుంది.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



