హోటల్ రూమ్‌లో దయ్యాన్ని చూశా : కృతిశెట్టి
అందాల హీరోయిన్ కృతి శెట్టి దయ్యాన్ని చూసిందట. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ గదిలో ఒక దెయ్యాన్ని చూశానని ఆమె వెల్లడించారు.
Flash news | Published On Dec 9, 2025, 12.49 pm IST
అందాల హీరోయిన్ కృతి శెట్టి దయ్యాన్ని చూసిందట. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ గదిలో ఒక దెయ్యాన్ని చూశానని ఆమె వెల్లడించారు. తమిళ నటుడు కార్తి హీరోగా, నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వా వాత్తియార్' చిత్రంలో కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఆత్మలతో మాట్లాడే ఒక జిప్సీ యువతి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, "ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఒక ఆత్మ రూపాన్ని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి అది మాయమైంది. ఆ ఆత్మ నాకు సహాయం చేయడానికి వచ్చిందో లేక పాత్ర కోసం నేను చేస్తున్న సాధన వల్ల వచ్చిందో తెలియదు" అని కృతి తెలిపారు. తనకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. "నేను తుళు సంప్రదాయానికి చెందినదాన్ని. మేము మా పూర్వీకులను దేవతలుగా పూజిస్తాం. వారు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉంటారని నమ్ముతాం. ఇప్పుడు ఈ ఘటనతో ఆ నమ్మకం మరింత బలపడింది" అని వివరించారు. ఈ అనుభవం వల్ల సినిమాలో తాను పోషిస్తున్న పాత్రపై మరింత నమ్మకం కలిగిందని, నటనలో అది తనకు బాగా ఉపయోగపడిందని కృతి శెట్టి అన్నారు. ఈ చిత్రంలో కార్తి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్, కరుణాకరన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



