Vinod Kumar | ఇక్కడ.. అక్కడ.. రెండు ఓట్ల సంగతి ఎప్పుడు తేలుస్తరు?
Vinod Kumar | ఒక్కొక్కరికి రెండు చోట్ల ఉన్న ఓట్ల సంగతిని ఎప్పుడు తేలుస్తారని.. అలాంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, సోమ భరత్, కర్నె ప్రభాకర్, వై సతీష్‌రెడ్డి, సుమిత్రానంద్‌తో కలిసి సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఎస్ఐఆర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులను వివరించారు.
- బీఎల్వోలు సరిగా పని చేస్తలేరు
- చాలా మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందలే
- మాకు చాలా ఫిర్యాదులు వచ్చాయ్
- ఇంకా సమయం పెంచండి
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని కోరిన బీఆర్ఎస్ నేతలు
Vinod Kumar | త్రినేత్ర.న్యూస్: ఒక్కొక్కరికి రెండు చోట్ల ఉన్న ఓట్ల సంగతిని ఎప్పుడు తేలుస్తారని.. అలాంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, సోమ భరత్, కర్నె ప్రభాకర్, వై సతీష్‌రెడ్డి, సుమిత్రానంద్‌తో కలిసి సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఎస్ఐఆర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులను వివరించారు. BLOలు సక్రమంగా పని చేయటం లేదన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఓటర్లకు ఇవ్వడం లేదని.. చాలా మందికి ఇంకా ఫామ్ అందలేదని చెప్పారు.
మా పార్టీ ప్రత్యేక కమిటీ వేసింది..
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడారు. SIR జరుగుతున్న నేపథ్యంలో మా పార్టీ తరఫున వినతి పత్రం సీఈవోకు అందించాం. ఎస్ఐఆర్ కోసం మా పార్టీ ఒక ప్రత్యేక కమిటీ వేసింది. BLO, BLA లతో కలిసి పనిచేయటం కోసం వాళ్లను నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా మాకు చాలా వినతులు వచ్చాయి. అవన్నీ CEO సుదర్శన్ రెడ్డికి అందించాం. 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంకా సమయం పెంచాలని అడిగాం అని మాజీ ఎంపీ తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తాం..
కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయాలు వెల్లడిస్తాం. డూప్లికేట్ ఓట్ల విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని కోరాం. ఇక్కడ, అక్కడ రెండు ఓట్లు ఉన్నాయి. అలాంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలి. దీనిపై అవగాహన కల్పించాలి. పేర్ల విషయంలో గందరగోళం ఉంది. వీటిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని BLOలకు తగిన సూచనలు ఇవ్వాలని కోరాం అని వినోద్‌కుమార్ వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం
- ●Vinod Kumar | భద్రాచలం కొట్టుకుపోతుందని రేవంత్ చెప్పమన్నడా?
- ●Jana Nayagan | జన నాయగన్‌కు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు - 13 కట్స్ - రన్‌టైమ్ రివీల్ - అసలు ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ జోష్.. కొనసాగుతున్న బుల్ ర్యాలీ..
- ●Prashant Kishor | బీజేపీ కంచుకోటపై ప్రశాంత్ కిషోర్ కన్ను.. బరిలో 'జన్ సురాజ్'.. కులమత రాజకీయాలకు చెక్ పెట్టేందుకేనా?
- ●Gangula Kamalakar | నీళ్లిడవకుంటే మళ్లీ చలో కన్నేపల్లి: మాజీ మంత్రి గంగుల కమలాకర్

Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

Vinod Kumar | భద్రాచలం కొట్టుకుపోతుందని రేవంత్ చెప్పమన్నడా?

Jana Nayagan | జన నాయగన్‌కు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు - 13 కట్స్ - రన్‌టైమ్ రివీల్ - అసలు ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ జోష్.. కొనసాగుతున్న బుల్ ర్యాలీ..





