త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | అమెరికాలో 30 ఏండ్లుగా ఉంటున్నోళ్లే హోట‌ల్ పెట్ట‌లేక‌పోయారు.. కేటీఆర్ ఆరేండ్లే ఉండి 3 స్టార్ హోట‌ల్స్ కొన్నారా?

Chamala Kirankumar Reddy | త్రినేత్ర న్యూస్: అమెరికాలో 30 ఏండ్లుగా ఉంటున్నోళ్లే జూబ్లీహిల్స్‌లో ఒక హోట‌ల్‌, ఒక ఇల్లు కొన‌లేక‌పోయార‌ని.. కేటీఆర్ ఆరేండ్లే ఉండి మూడు స్టార్ హోట‌ల్స్ కొన్నారా అని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Oct 1, 2026, 7.10 pm IST

Chamala Kirankumar Reddy | అమెరికాలో 30 ఏండ్లుగా ఉంటున్నోళ్లే హోట‌ల్ పెట్ట‌లేక‌పోయారు.. కేటీఆర్ ఆరేండ్లే ఉండి 3 స్టార్ హోట‌ల్స్ కొన్నారా?
Advertisement
  • ఆయ‌న‌ ఆస్తులు ఎక్క‌డెక్క‌డున్న‌యో చెప్తే.. ప‌దే ప‌దే మేం బ‌య‌ట‌పెట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌దు
  • కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతితో వచ్చిన సొమ్ముతోనే హోటల్స్ పెట్టారా?
  • అమెరికా, స్విట్జ‌ర్లాండ్‌, ఇంగ్లండ్‌లో ఎన్ని ఆస్తులున్న‌యో చెప్తే మాకో క్లారిటీ ఉంట‌ది
  • కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి కౌంటర్

Chamala Kirankumar Reddy | త్రినేత్ర న్యూస్: అమెరికాలో 30 ఏండ్లుగా ఉంటున్నోళ్లే జూబ్లీహిల్స్‌లో ఒక హోట‌ల్‌, ఒక ఇల్లు కొన‌లేక‌పోయార‌ని.. కేటీఆర్ ఆరేండ్లే ఉండి మూడు స్టార్ హోట‌ల్స్ కొన్నారా అని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ప్ర‌శ్నించారు. కేటీఆర్ ఆస్తులు ఎక్క‌డెక్క‌డున్న‌యో చెప్తే ప‌దే ప‌దే మేం బ‌య‌ట‌పెట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతితో వచ్చిన సొమ్ముతోనే తెలివితేటలుగా మార్చి హోటల్స్ పెట్టారా అని నిల‌దీశారు. కేటీఆర్‌కు అమెరికా, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్ లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో స్వయంగా బయటపెడితే క్లారిటీ వస్తుందని వ్యాఖ్యానించారు. ఈమేర‌కు గురువారం ఆయ‌న మాట్లాడుతూ కేటీఆర్‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

కేటీఆర్ అమెరికాలో ఉండి వచ్చి 2006లో హోటల్ కొన్నా అని అంటున్నారు. ఆ తర్వాత మూడు హోటల్స్ కొన్నా 2009 ఎన్నికల అఫిడవిట్ లో పెట్టినా అని చెప్తున్నారు. అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్న వాళ్ళు సైతం ఒక హోటల్, జూబ్లీహిల్స్ లో ఒక ఇళ్ళు కొనలేకపోయారు. అమెరికాలో ఆరు ఏళ్ళు ఉండి కేటీఆర్ మూడు స్టార్ హోటల్స్ కొన్నారా? 2014 లో ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే పదేళ్ళలో అప్పులు ఎందుకు చేశారు.

10 స్టార్ హోటల్స్ కట్టే సామర్థ్యం ఉన్న కేటీఆర్ ఎందుకు ఐటీ, మున్సిపల్ మంత్రిగా ఉండి తెలంగాణను ధనిక రాష్ట్రం చేయలేదు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి 8 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారు? నాకు, మా నాన్నకు ఉండటానికి ఇళ్ళు లేదని కేటీఆర్ అన్నారు. అంతలోనే మేం ఆగర్భ శ్రీమంతులం అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ తన హోటల్స్ ను మూడింతలు చేసుకున్నారు. దేశంలో ఆర్థికమాంద్యంతో చాలా హోటల్స్ మూత పడ్డాయి. రాష్ట్రం పూర్తిగా దివాళా తీసింది.

కేసీఆర్ కుటుంబంలో అందరికి ఫామ్ హౌస్ లు ఎట్లా వచ్చాయి? ఇక్కడ కేటీఆర్ అక్కడ నరేంద్ర మోదీ సహకారంతో అంబానీ, అదానీ పరిస్థితులు మెరుగుపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనతో కేటీఆర్ కు గుండెల్లో దడ పుడుతోంది అని చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement