Nirmala Sitharaman | నిర్మలమ్మ ఈసారి ఏ రంగు చీర ధరించారో తెలుసా..? దాని ప్రత్యేకత ఇదే
Nirmala Sitharaman | బడ్జెట్ వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తన మార్క్‌ను చూపించారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలమ్మ ఈ సారి కూడా ప్రత్యేకమైన చీరలో మెరిశారు.
Flash news | Published On Feb 1, 2026, 11.08 am IST
Nirmala Sitharaman | కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2026-27) పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌కు సమర్పించారు. ఇక ఈ బడ్జెట్‌పై సామాన్య ప్రజలు, వేతన జీవులు, వ్యాపారులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో నిర్మలమ్మ ఈసారి ఎలాంటి చీరలో వస్తారన్న ఆసక్తి నెలకొంది.
తొమ్మిదో బడ్జెట్.. తొమ్మిదో చీర..
బడ్జెట్ వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తన మార్క్‌ను చూపించారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలమ్మ ఈ సారి కూడా ప్రత్యేకమైన చీరలో మెరిశారు. తన సొంత రాష్ట్రమైన తమిళనాడు సాంస్కృతి, వారసత్వం ఉట్టిపడేలా చేనేత పట్టుచీర ధరించారు. లైట్ గోల్డెన్ బ్రౌన్ చెక్స్‌తో ఉన్న మెరూన్ కలర్ కాంజీవరం చీరలో కనిపించారు. మరికొన్ని నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ప్రాముఖ్యతను ఇస్తూ నిర్మలమ్మ కాంజీవరం చీరను ఎంపిక చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విపరీతంగా టాక్ నడుస్తోంది. తమిళనాడులో తయారుచేసే ఈ చేనేత పట్టుచీరలకు 2005లో భౌగోళికంగా గుర్తింపు లభించింది.
గత ఏడాది..
గత ఏడాది ఎన్నికల అనంతరం జులై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలో తెలుపు రంగు, బంగారు మోటిఫ్‌లతో ఉన్న మెజెంటా బోర్డర్ కలగలిపిన చీరలో నిర్మలా సీతారామన్ కనిపించారు.
2019లో మంగళగిరి గులాబీ రంగు చీర
2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్‌కేస్ స్థానంలో బహీ ఖాతాతో మీడియా ముందుకు వచ్చారు. ఇక ఆ ఏడాది నుంచి గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన వరకు బడ్జెట్ ప్రసంగం చదవబోయే రోజు తాను ధరించే చీర విషయంలో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు.
2020లో నీలం రంగు అంచులో పసుపు పచ్చ - బంగారు వర్ణం
2020లో నీలం రంగు అంచులో పసుపు పచ్చ - బంగారు వర్ణంలో ఉన్న చీరకట్టులో నిర్మలమ్మ మెరిసిపోయారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే ఆస్పిరేషనల్ ఇండియా థీమ్‌కు అనుగుణంగా దీనిని ధరించారు.
2021లో భూదాన్ పోచంపల్లి చీర
2021లో ఎరుపు గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.
2022లో ఒడిశాకు చెందిన చేనేత చీర
2022లో మెరూన్ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరనే. ఆ రంగు దుస్తుల్లో ఆమె చాలా సాదాసీదాగా కనిపించారు. ఇది ఆమె నిరాడంబరతకు నిదర్శనమని విశ్లేషకులు పేర్కొన్నారు.
2023లో బ్రౌన్ రంగు
2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు.
2024లో టస్సర్ పట్టు చేనేత చీర
సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ సమయంలో కాంతా చీరలో కళగా ఆమె కనిపించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ప్రతీకగా రామా బ్లూ రంగు చీర ధరించారు. ఈ టస్సర్ పట్టు చేనేత చీరపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించే ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది.
సంబంధిత వార్తలు

Delhi court | న్యాయమూర్తి నోట Floccinaucinihilipilification పదం.. అసలు దీని అర్థమేంటి..?
ఏప్రిల్ 2, 2026

CM Revanth Reddy | సంక్షేమ పథకాలు బరువైనాయి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మార్చి 9, 2026

Prahlad Joshi | తెలంగాణకు ఏం ఇవ్వలేదని తప్పుడు ప్రచారం : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
ఫిబ్రవరి 6, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



