Delivery Agent | లిఫ్ట్ నిరాకరణ.. భారీ పార్శిల్‌తో ఆరంతస్తులు ఎక్కిన డెలివరీ బాయ్.. VIDEO
Delivery Agent | డెలివరీ ఏజెంట్లు, ప్యాకర్స్ అండ్ మూవర్స్ నివాస సముదాయాల్లోని మెయిన్ లిఫ్ట్ (elevator)లను ఉపయోగించకుండా సొసైటీ నిబంధనల పేరుతో అపార్ట్‌మెంట్ వాసులు అడ్డుకుంటున్నారు.
Flash news | Published On Feb 2, 2026, 2.00 pm IST
Delivery Agent | డెలివరీ ఏజెంట్లు, ప్యాకర్స్ అండ్ మూవర్స్ నివాస సముదాయాల్లోని మెయిన్ లిఫ్ట్ (elevator)లను ఉపయోగించకుండా సొసైటీ నిబంధనల పేరుతో అపార్ట్‌మెంట్ వాసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఎత్తైన భవనాల్లో డెలివరీ చేసేందుకు వెళ్లే ఏజెంట్లు (delivery agent) తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని అంతస్తుల మేర మెట్లు ఎక్కుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం వెలుగుచూశాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
నివాస భవనంలోని లిఫ్ట్ నిరాకరించడంతో ఓ డెలివరీ ఏజెంట్ భారీ పార్శిల్‌తో ఏకంగా ఆరు అంతస్తులు మెట్లు ఎక్కుతూ వెళ్లాడు. తన భుజంపై మోయలేని మూటతోనే తిప్పలు పడుతూ సదరు డెలివరీ ఏజెంట్ మెట్లెక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అపార్ట్‌మెంట్ వాసులు, సెక్యూరిటీ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. ‘చిన్న చిన్న సామన్లకు అనుమతించకపోయినా.. ఇలా మోయలేని బరువు తీసుకెళ్లే వారికైనా లిఫ్ట్ అనుమతించొచ్చు కద..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. డెలివరీ ఏజెంట్ల పట్ల కనీస సానుభూతితో ఉండాలంటూ చురకలంటిస్తున్నారు. ఇక స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు సైతం ఈ వీడియోపై స్పందిస్తున్నాయి. తమ ఏజెంట్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. డెలివరీ ఏజెంట్లకు లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.
https://x.com/DealsDhamaka/status/2017423463687065997?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2017423463687065997%7Ctwgr%5E4fe9a44693f95e2d05bf30d6258bc46973b9ff13%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Findianexpress.com%2Farticle%2Ftrending%2Ftrending-in-india%2Fdenied-elevator-delivery-agent-climbs-to-6th-floor-carrying-heavy-parcel-on-back-video-sparks-debate-10507567%2F
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Rakul Preet Singh | సినిమా ప్రమోషన్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న రకుల్…
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



