CM Revanth Reddy | వికసిత్ భారత్‌కు రాష్ట్రాల సహకారం అవసరం
CM Revanth Reddy | 2047 నాటికి స్వతంత్ర భారతం వందేళ్లు పూర్తి చేసుకోబోతుంది అని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )తెలిపారు. ప్రధాని మోదీ 2047 వికసిత్ భారత్( Vikasith Bharat ) లక్ష్యంగా పనిచేస్తున్నారు.. ఇందుకు రాష్ట్రాల సహకారం అవసరం అని పేర్కొన్నారు.
Flash news | Published On Oct 14, 2026, 2.59 pm IST
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : 2047 నాటికి స్వతంత్ర భారతం వందేళ్లు పూర్తి చేసుకోబోతుంది అని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )తెలిపారు. ప్రధాని మోదీ 2047 వికసిత్ భారత్( Vikasit Bharat ) లక్ష్యంగా పనిచేస్తున్నారు.. ఇందుకు రాష్ట్రాల సహకారం అవసరం అని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో కాదు అని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్‌లో సమాఖ్య (SAMAKHYA) బిజినెస్ సమ్మిట్-2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.

సమాఖ్య అనే పదానికి చాలా బలం ఉంది.. పురాతన కాలంలో వస్తు మార్పిడి పద్దతి ద్వారా వ్యాపారం జరిగేది. ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం చాలా ఉంది. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి అంది పుచ్చుకోవడానికి సమాఖ్యలు ఉపయోగపడుతాయి. కొత్త తరం అభివృద్ధి చెందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. సినిమా, రాజకీయ రంగాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వివిధ హోదాల్లో రాణించారు. ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాదు.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. సక్సెస్ స్టోరీస్‌ను సమాఖ్య నిక్షిప్తం చేసి కొత్త తరానికి అందించాలి.
2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం
అందుకే 2025లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నాం. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రాన్ని క్యూర్(CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని క్యూర్ - కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ ఐటీ, సేవా రంగాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని ప్యూర్ - పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ రంగాలను ప్రోత్సహిస్తాం. మిగిలిన గ్రామీణ ప్రాంతాలను రేర్ - రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధికి ప్రాధాన్యం ఇస్తాం. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పం అని సీఎం స్పష్టం చేశారు.
పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్ మార్క్‌గా మారింది
ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. దీన్ని 10 శాతానికి చేర్చాలనే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. నాలుగు వందల ఏళ్ల క్రితమే దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్ మార్క్‌గా మారింది. చార్మినార్ తరువాత బిజినెస్‌కు ల్యాండ్ మార్క్ హైటెక్ సిటీ. నూతన పారిశ్రామిక విధానంలో మీరంతా భాగస్వాములు కావాలి. ఇప్పటి వరకు మనవాళ్లు కేవలం కార్పొరేట్ కంపెనీలకు సర్వీస్ చేసే వైపు మాత్రమే ఉన్నారు. మన ప్రాంతానికి చెందిన వాళ్లు పెట్టుబడులు పెట్టి గ్లోబల్‌గా ఎదగాలన్నారు.
మీ పెట్టుబడులకు మా భరోసా ఉంటుంది..
ఒకసారి మనం ప్రపంచాన్ని గమనిస్తే.. మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలే ఆర్థికంగా బలపడ్డాయి. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మహిళలకు 61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం. ఆర్టీసీ బస్సులకు, పెట్రోల్ బంకులకు, సోలార్ ప్లాంట్స్ కు మహిళలను యజమానులను చేశాం. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు నా సూచన ఒక్కటే. యువతతో పాటు మహిళలను ప్రోత్సహించండి. ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తాం. మంచి విధానాలను మా ప్రభుత్వం కొనసాగిస్తుంది. మీ పెట్టుబడులకు మా భరోసా ఉంటుంది. తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా ముందుకు వెళదాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామరాజు, ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస రావు, దానం నాగేందర్, మున్నూరు కాపు ఫౌండేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జస్టిస్ భవానీ ప్రసాద్, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●No Cost EMI | పండుగ సేల్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ.. నిజంగా లాభమేనా?
- ●Sri Chaitanya Guruji | జూబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వేధింపులు..
- ●Delhi Police | వాళ్లు చేసిన నేరమేమిటంటే? సీజేపీ సభ్యుల అరెస్ట్‌పై ఢిల్లీ పోలీసుల ఫుల్ ఎక్స్ప్లనేషన్
- ●VC Sajjanar | చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేయడం క్షమించారని నేరం
- ●FII Selling | భారత మార్కెట్లపై ఎఫ్ఐఐల పిడుగు.. సెప్టెంబర్‌లో 4.1 బిలియన్ డాలర్ల మేర విక్రయాలు..
- ●Gutha Sukender Reddy | మహబూబ్‌నగర్ నల్లగొండ మధ్య జల వివాదాలు సృష్టిస్తున్నారు..: గుత్తా సుఖేందర్ రెడ్డి

No Cost EMI | పండుగ సేల్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ.. నిజంగా లాభమేనా?

Sri Chaitanya Guruji | జూబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వేధింపులు..

Delhi Police | వాళ్లు చేసిన నేరమేమిటంటే? సీజేపీ సభ్యుల అరెస్ట్‌పై ఢిల్లీ పోలీసుల ఫుల్ ఎక్స్ప్లనేషన్

VC Sajjanar | చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేయడం క్షమించారని నేరం






