Ayurveda institutes | దేశంలో మూడు ఆయుర్వేద ఆసుపత్రుల ఏర్పాటు
Ayurveda institutes | దేశంలో మూడు కొత్త ఆయుర్వేద మెడికల్ కాలేజీలను (Ayurveda institutes) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Flash news | Published On Feb 1, 2026, 12.10 pm IST
Ayurveda institutes | వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ (Union Budget 2026)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. దేశంలో సంప్రదాయ వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే దేశంలో మూడు కొత్త ఆయుర్వేద మెడికల్ కాలేజీలను (Ayurveda institutes) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులను తీసుకురానున్నట్లు నిర్మలమ్మ ఈ సందర్భంగా తెలిపారు. హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు, జౌళిరంగం ఆధునీకరణ, పరిశ్రమలకు విద్యా సంస్థల అనుసంధానం వంటి అంశాలపై దృష్టి సారించినట్లుగా పేర్కొన్నారు.
'బయోఫార్మా శక్తి'కి రూ.10,000 కోట్లు
భారతదేశాన్ని ప్రపంచ బయోఫార్మా తయారీ హబ్‌గా (Global Biopharma Hub) తీర్చిదిద్దేందుకు 'బయోఫార్మా శక్తి' (Biopharma Shakti) అనే కొత్త కార్యక్రమాన్ని మంత్రి ప్రకటించారు. దీని కోసం రాబోయే ఐదేళ్లలో రూ10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
సెమీకండక్టర్ రంగం కోసం రూ.40 వేల కోట్లు
దేశ సెమీకండక్టర్ వృద్ధి కోసం సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0ని (Semiconductor mission 2.0) నిర్మలమ్మ ప్రకటించారు. ఇందుకోసం రూ.40,000 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సెమీకండక్టర్ల కోసం పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన, శిక్షణా కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు. అంతేకాదు రూ.10 వేల కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని కూడా నిర్మలమ్మ ప్రకటించారు. ఫార్మా, విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో కొత్త విద్యాసంస్థలు తీసుకురానున్నట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు

Delhi court | న్యాయమూర్తి నోట Floccinaucinihilipilification పదం.. అసలు దీని అర్థమేంటి..?
ఏప్రిల్ 2, 2026

Prahlad Joshi | తెలంగాణకు ఏం ఇవ్వలేదని తప్పుడు ప్రచారం : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
ఫిబ్రవరి 6, 2026

UPI transactions | రూ.230 లక్షల కోట్లు.. రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు : కేంద్రం
ఫిబ్రవరి 4, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



