UPI transactions | రూ.230 లక్షల కోట్లు.. రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు : కేంద్రం
UPI transactions | 2025-26 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
UPI transactions | దేశంలో డిజిటిల్ చెల్లింపులు (UPI transactions) చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫలితంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ((UPI) లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) రాజ్యసభ (Rajya Sabha)కు తెలియజేశారు.
ఎగువ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దేశంలో యూపీఐ లావాదేవీల విలువ వేగంగా పెరుగుతోందన్నారు. 2025-26లో ఇప్పటి వరకూ రూ.230 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. 2022-23లో జరిగిన మొత్తం రూ.139 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని పేర్కొన్నారు.
ఎనిమిది దేశాల్లో..
భారత్ వెలుపలా యూపీఐ వినియోగం పెరుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది దేశాల్లో ఇది పనిచేస్తున్నట్లు చెప్పారు. భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, ఖతార్, సింగపూర్, శ్రీలంక, యూఏఈల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. యూపీఐని అంతర్జాతీయంగా విస్తరించేందుకు ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
సంబంధిత వార్తలు

DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..
జులై 27, 2026

RBI Plastic Notes | త్వరలో మీ జేబుల్లోకి రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు.. మరి పాత కాగితం నోట్ల పరిస్థితేంటి?
జులై 27, 2026

Nirmala Sitharaman | యువతలో ఆమాత్రం స్పిరిట్ ఉండాలి : నిర్మలా సీతారామన్
జులై 26, 2026
తాజావార్తలు
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి
- ●DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!

Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?



