త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy, Ramchandar Rao | ఆషాఢ బోనాలు.. ఉజ్జ‌యిని మ‌హంకాళీ అమ్మ‌వారికి కిష‌న్‌రెడ్డి మొక్కులు

Kishan Reddy, Ramchandar Rao | హైద‌రాబాద్ ఆషాఢ బోనాల వేడుక‌లను పుర‌స్క‌రించుకొని ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ద‌ర్శించుకున్న‌ట్లు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వ‌ర్షాలు స‌మృద్ధిగా కుర‌వాల‌ని, పాడి పంట‌ల‌తో ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని కోరుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

S

Flash news | Published On Aug 9, 2026, 4.35 pm IST

Kishan Reddy, Ramchandar Rao | ఆషాఢ బోనాలు.. ఉజ్జ‌యిని మ‌హంకాళీ అమ్మ‌వారికి కిష‌న్‌రెడ్డి మొక్కులు
Advertisement

Kishan Reddy, Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్: హైద‌రాబాద్ ఆషాఢ బోనాల వేడుక‌లను పుర‌స్క‌రించుకొని ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ద‌ర్శించుకున్న‌ట్లు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వ‌ర్షాలు స‌మృద్ధిగా కుర‌వాల‌ని, పాడి పంట‌ల‌తో ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని కోరుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని మనసారా కోరుకున్న‌ట్లు వివ‌రించారు. అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన‌ట్లు పేర్కొన్నారు.

క‌ట్ట మైస‌మ్మను ద‌ర్శించుకున్న‌ రాంచంద‌ర్‌రావు..

బోనాల పర్వదినం సందర్భంగా మల్కాజిగిరిలోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందినట్లు పేర్కొన్నారు. అనంత‌రం మల్కాజిగిరిలోని సఫిల్‌గూడ కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకొన్న‌ట్లు చెప్పారు. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా శక్తి, సిరిసంపదలు, ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించిన‌ట్లు రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement