Prabhas | బాహుబలి మూవీపై వెబ్‌సిరీస్ – ఎవరికి తెలియని సీక్రెట్స్ చెప్పబోతున్న ప్రభాస్, అనుష్క
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలపై ఓ డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీ ప్రేక్షకలు ముందుకు రాబోతుంది. బాహుబలి ది టార్చ్‌బేరర్ పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ జూన్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Jun 21, 2026, 8.01 pm IST
Prabhas | ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లాయి . వెయ్యి కోట్ల వసూళ్లను సాధించే సత్తా తెలుగు సినిమాలకు ఉందని బాహుబలితోనే ఫస్ట్ టైమ్ రాజమౌళి, ప్రభాస్ నిరూపించారు. తెలుగు సినిమా చరిత్రను బాహుబలికి ముందు...బాహుబలికి తర్వాత అని చెప్పుకునేలా చేశారు. టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ కల్చర్ బాహుబలి, బాహుబలి 2 సినిమాలతోనే మొదలైంది.
టార్చ్‌బేరర్...
తాజాగా బాహుబలి మూవీపై ఓ డాక్యుమెంటరీ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాహబలి ది టార్చ్‌బేరర్ పేరుతో రూపొందిన ఈ సిరీస్ జూన్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ఆదివారం అఫీషియల్‌గా ప్రకటించింది.
ప్రభాస్...రానా...
ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, డైరెక్టర్ రాజమౌళితో పాటు బాహుబలిలో నటించిన కొందరు యాక్టర్ల, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు కనిపించబోతున్నారు.
తెలియని సీక్రెట్స్...
బాహుబలి, బాహుబలి 2 సినిమాల నిర్మాణంలో తెర వెనుక ఏం జరిగింది? షూటింగ్‌లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది బాహుబలి ది టార్చ్‌బేరర్ డాక్యుమెంటరీలో యాక్టర్లు, టెక్నీషియన్లు అభిమానులతో పంచుకోనున్నారట. ఇప్పటివరకు ఎవరికి తెలియని పలు సీక్రెట్స్‌ను ప్రభాస్, అనుష్క ఈ డాక్యుమెంటరీలో రివీల్ చేయనున్నారట. బాహుబలి కథకు ఎలా అంకురార్పణ పడింది? ప్రభాస్ ఈ సినిమాలోకి ఎలా ఎంటరయ్యాడన్నది కూడా రాజమౌళి వివరించనున్నారట.ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తోన్నారు రాజమౌళి. మరోవైపు ప్రభాస్ కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు.
సంబంధిత వార్తలు

Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ – సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
జూన్ 19, 2026

Alia Bhatt | ప్రభాస్ కల్కి 2లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ – దీపికా పడుకోణ్ ప్లేస్‌లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ?
జూన్ 16, 2026

Telugu Web Series | ఓటీటీలోకి తెలుగు బోల్డ్ కామెడీ వెబ్‌సిరీస్ – సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా టాలీవుడ్ హీరో
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●VBG Ramji Act 2025 | కేంద్రం తెచ్చిన కొత్త చట్టంపై తెలంగాణ సీరియస్.. ఆ రాష్ట్రాలతో కలిసి సుప్రీంకోర్టుకు?
- ●Krithi Shetty | లవర్ బాయ్‌గా మారిన డైరెక్టర్ శంకర్ కొడుకు - కృతిశెట్టితో రొమాన్స్...
- ●BMW Crash Mumbai | 250 KMPH స్పీడ్, చెల్లాచెదురుగా బాడీ పార్ట్స్.. ముంబై సమీపంలో ముక్కలైన లగ్జరీ BMW కారు, బర్త్‌డే నాడే ఇద్దరి మృతి!
- ●Jonita Gandhi | బికినీలో సింగర్ జోనితా గాంధీ గ్లామర్ షో - హీరోయిన్లు కూడా పనికిరారంటూ ఫ్యాన్స్ కామెంట్స్
- ●US Iran Peace Talks | పాత వైరానికి స్వస్తి.. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు! "మిడిల్ ఈస్ట్‌లో కొత్త అధ్యాయం" అన్న జేడీ వాన్స్
- ●TG Heavy Rains | తెలంగాణలో రాగల నాలుగురోజులు భారీ వర్షాలు.. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

VBG Ramji Act 2025 | కేంద్రం తెచ్చిన కొత్త చట్టంపై తెలంగాణ సీరియస్.. ఆ రాష్ట్రాలతో కలిసి సుప్రీంకోర్టుకు?

Krithi Shetty | లవర్ బాయ్‌గా మారిన డైరెక్టర్ శంకర్ కొడుకు - కృతిశెట్టితో రొమాన్స్...

BMW Crash Mumbai | 250 KMPH స్పీడ్, చెల్లాచెదురుగా బాడీ పార్ట్స్.. ముంబై సమీపంలో ముక్కలైన లగ్జరీ BMW కారు, బర్త్‌డే నాడే ఇద్దరి మృతి!

Jonita Gandhi | బికినీలో సింగర్ జోనితా గాంధీ గ్లామర్ షో - హీరోయిన్లు కూడా పనికిరారంటూ ఫ్యాన్స్ కామెంట్స్



