Toxic Movie | విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న యశ్ ‘టాక్సిక్’ మూవీ..!
Toxic Movie | రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తున్నది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల హక్కులను రూ.120 కోట్లకు సొంతం చేసుకున్నారు.
Entertainment | Published On Feb 11, 2026, 8.15 pm IST
Toxic Movie | రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తున్నది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల హక్కులను రూ.120 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇది తెలుగు సినీ చరిత్రలో ల్యాండ్ మార్క్ డీల్‌గా నిలిచింది. అలాగే, విదేశీ పంపిణీ సంస్థ ఫార్స్ ఫిల్మ్ ఓవర్సీస్ హక్కులను రూ.105 కోట్లకు కొనుగోలు చేయగా.. అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ రెండు డీల్‌లు సినిమా మార్కెట్ మీద ఉన్న విశ్వాసాన్ని, యశ్ సత్తా, అభిమానుల ఎగ్జిట్‌మెంట్‌ని సులభంగా చూపిస్తున్నాయి. సినిమా కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రత్యేకంగా విడుదల కానుంది.
ఇంగ్లీష్ వెర్షన్ కోసం కూడా భారీ పోటీ ఉంది. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత యశ్ నటన, గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, బ్లాక్‌బస్టర్ ఫార్ములా ‘టాక్సిక్’పై అంచనాలు పెంచాయి. సినిమా కోసం అత్యాధునిక వీఎఫ్ఎక్స్, నేషనల్ అవార్డు గ్రహీతుల సాంకేతిక బృందం, హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు పని చేశారు. యశ్, గీతు మోహన్‌దాస్ కాంబోలో వస్తున్న ఈ మూవీకి జాతీయ అవార్డు గ్రహీతలైన సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైనర్ టిపి అబిద్, యాక్షన్ డైరెక్టర్లు అన్బరివ్, కేచా ఖంఫక్‌దీ, జాన్ విక్ ఫేమ్ జెజె పెర్రీ కలిసి ప్రపంచ స్థాయి విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనున్నారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. నేపాల్, జపాన్, చైనా మినహా ఇతర ప్రాంతాల్లో రిలీజ్ అవుతుంది. మార్చి 19న ఈద్, ఉగాది సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ మార్కెట్ అంచనాల ప్రకారం.. దాదాపు రూ.వెయ్యి కోట్ల బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






