Chiranjeevi – Sridevi | చిరంజీవి హీరో – శ్రీదేవి నిర్మాత – ఈగో ఇష్యూస్‌తో మధ్యలోనే ఆగిపోయిన తెలుగు మూవీ ఏదో తెలుసా?
జగదేకవీరుడు అతిలోక సుందరి కంటే ముందు చిరంజీవి హీరోగా శ్రీదేవి నిర్మాణంలో ఓ భారీ బడ్జెట్ సోషియా ఫాంటసీ మూవీ ప్రారంభమైంది. ఎమ్జీఆర్, జయలలిత వంటి దిగ్గజ నటుల చేతుల మీదుగా మొదలైన ఈ మూవీ సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈగో ఇష్యూస్‌తో ఆగిపోయింది.
Entertainment | Published On Mar 14, 2026, 6.38 pm IST
Chiranjeevi - Sridevi | టాలీవుడ్‌లో చిరంజీవి, శ్రీదేవిలది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి, రాణికాసుల రంగమ్మ, ఎస్‌పీ పరశురామ్ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ఈ సినిమాల్లో చిరంజీవి, శ్రీదేవి యాక్టింగ్, వారి కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నాయి.ఈ మూడు సినిమాలే కాకుండా చిరంజీవి, శ్రీదేవి జంటగా మరో తెలుగు సినిమా కూడా రావాల్సింది. పాటల రికార్డింగ్‌తో పాటు సగం వరకు షూటింగ్ పూర్తయిన తర్వాత ఈగో ఈష్యూస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమాకు శ్రీదేవి నిర్మాత కావడం గమనార్హం.
తల్లి పేరుతో బ్యానర్...
హీరోయిన్‌గా నంబర్‌వన్‌గా ఉన్న రోజుల్లో సినిమా నిర్మాణంపై శ్రీదేవి మనసు పడింది. తల్లి లతా పేరుతో లతా ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను నెలకొల్పింది. ఈ నిర్మాణ సంస్థపై తొలి ప్రయత్నంలో వజ్రాల దొంగ పేరుతో ఓ సోషియా ఫాంటసీ యాక్షన్ మూవీ నిర్మించాలని అనుకుంది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఎమ్జీఆర్, జయలలిత వంటి దిగ్గజ యాక్టర్ల చేతుల మీదుగా వజ్రాల దొంగ మూవీ లాంఛ్ అయ్యింది. ఓపెనింగ్ ఈవెంట్‌తోనే దక్షిణాదిలో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
ఈగో ఇష్యూస్...
వజ్రాల దొంగ మూవీకి కోదండరామిరెడ్డి డైరెక్టర్‌గా ఫిక్సయ్యారు. యండమూరి వీరేంద్రనాథ్ కథను అందించారు. బప్పిలహరి సారథ్యంలో మూడు పాటలు రికార్డ్ చేశారు. ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అనుకోకుండా షూటింగ్ సమయంలోనే చిరంజీవి, శ్రీదేవి మధ్య ఈగో ఇష్యూస్ మొదలయ్యాయి. తానే నిర్మాత కావడంతో ఈ సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉండేలా శ్రీదేవి కథలో మార్పులు చేసిందట. ఆ మార్పుల పట్ల చిరంజీవి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి.
చేదు అనుభవం...
ఈగో సమస్యలు గొడవలుగా మారడంతో మధ్యలోనే వజ్రాల దొంగ మూవీ ఆగిపోయింది. నిర్మాతగా తొలి సినిమా శ్రీదేవికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దాంతో మళ్లీ సినిమా నిర్మాణం జోలికి శ్రీదేవి వెళ్లలేదు. వజ్రాల దొంగ ఆగిపోయిన తర్వాతే వీరిద్దరి కాంబినేషన్‌లో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా రావడం గమనార్హం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



