Aalim Hakim | సెలిబ్రిటీ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ హెయిర్ కట్‌కు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా!
Aalim Hakim | సెలిబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ అంటే అందరికి మొదట గుర్తొచ్చే పేరు ఆలిమ్ హకీమ్. విరాట్ కోహ్లి నుంచి రామ్ చరణ్ వరకు చాలా మంది సెలిబ్రిటీస్‌కు ఆలిమ్ హకీమ్ హెయిర్ స్టైలిష్ట్‌గా పనిచేస్తున్నాడు. హెయిర్ కట్ చేయడానికి ఆలిమ్ హకీమ్ ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా?
Entertainment | Published On Dec 12, 2025, 8.01 pm IST
రామ్ చరణ్ తో ఆలిమ్ హకీమ్
Aalim Hakim | ఆలిమ్ హకీమ్...సెలిబ్రిటీల అందరి నోళ్లలో తరచుగా వినిపించే పేరు. విరాట్ కోహ్లి (Virat Kohli) నుంచి ప్రభాస్ (Prabhas) వరకు ఎంతో మంది స్టార్ హీరోలు, క్రికెటర్లకు పర్సనల్ హెయిర్ స్టైలిష్ట్‌గా ఆలిమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ హీరోలందరూ ఆలిమ్ హకీమ్ ఫ్యాన్స్ కావడం గమనార్హం. ఓ కొత్త సినిమా మొదలైందంటే హీరో లుక్ కోసం ఆలిమ్ హకీమ్ రంగంలోకి దిగాల్సిందే.
ప్రభాస్ స్పిరిట్, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్, రామ్‌చరణ్ పెద్ది...ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాలకు స్టైలిష్ట్‌గా ఆలిమ్ హకీమ్ పనిచేస్తున్నాడు.
హీరోను మాస్‌గా తయారు చేయాలన్నా, క్లాస్ లుక్‌తో చూపించాలన్న ఆలిమ్ హకీమ్ చేతిలోనే ఉంటుంది. డైరెక్టర్ల సూచనలకు అనుగుణంగా హీరోల లుక్‌లను డిజైన్ చేస్తుంటారు. హెయిర్ స్టైలిస్ట్ అయినా ఆలిమ్ హకీమ్ సంపాదన మాత్రం హీరోలకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో ఉంటుందట.
హెయిర్ కటింగ్ కోసం ఆలిమ్ హకీమ్ మినిమం లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తాడు. జీఎస్‌టీ అదనం. అతడితో హెయిర్ కటింగ్ చేయించుకోవడం కూడా అంత ఈజీ కాదు. ముందస్తు అపాయింట్‌మెంట్‌లు, బుకింగ్స్...ఇలా చాలానే తతంగం ఉంటుందట. ముందుగా లక్ష రూపాయలు చెల్లిస్తేనే అతడికి అపాయింట్‌మెంట్ దొరుకుతుందట. అయితే ఎవరికి పడితే వారికి ఆలీమ్ హకీమ్ స్టైలిష్ట్‌గా పనిచేయడట. సెలిబ్రిటీస్‌ను ఎంచుకునే విషయంలో చాలా సెలిక్టివ్‌గా ఉంటాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.
అదే సినిమాలకు అయితే హకీమ్ రేటు సఫరేట్‌గా ఉంటుంది. ఒక్కో సినిమాకు 18 నుంచి 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఇండియాలోనే కాకుండా దుబాయ్‌లో కూడా ఇటీవలే ఆలిమ్ హకీమ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి . ఫ్లైట్ ఛార్జీలు కూడా కస్టమర్ల నుంచే వసూలు చేస్తాడట. ఈ విషయాన్ని కూడా ఓ ఇంటర్వ్యూలో ఆలీమ్ హకీమ్ వెల్లడించాడు.
ఆలిమ్ హకీమ్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి 12.8 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంది స్టార్ హీరోల కంటే అతడి ఎక్కువగా ఫాలోవర్స్ ఉండటం గమనార్హం.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



