SIR | రాజస్థాన్ ఓటర్ల జాబితాలో భారీ తేడా.. 30 లక్షల మంది పేర్లు మాయం
SIR | రాజస్థాన్ ఓటర్ల జాబితాల్లో భారీ తేడాలు వెలుగుచూశాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో సుమారు 5.15 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉపయోగించిన జాబితాలో సుమారు 5.45 కోట్ల మంది ఉన్నారు.
- సర్ తర్వాత ఈసీ జాబితాలో 5.15 కోట్ల ఓటర్లు
- స్థానిక ఎన్నికల్లో పాత జాబితాతోనే పోలింగ్
- మృతులుగా గుర్తించిన వారి పేర్లు మరో జాబితాలో ఎలా ఉన్నాయంటూ ప్రశ్నలు
SIR | రాజస్థాన్ ఓటర్ల జాబితాల్లో భారీ తేడాలు వెలుగుచూశాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో సుమారు 5.15 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉపయోగించిన జాబితాలో సుమారు 5.45 కోట్ల మంది ఉన్నారు. ఈ రెండు జాబితాల మధ్య దాదాపు 30 లక్షల మంది ఓటర్ల తేడా ఉండటం చర్చనీయాంశమైంది. కొత్త జాబితా అందుబాటులో ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికలకు పాత జాబితాను ఎందుకు ఉపయోగించారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
మూడేళ్లలో కాదు.. సవరణతో తగ్గిన ఓట్లు
సామాజిక కార్యకర్త నిఖిల్ డే వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎస్‌ఐఆర్‌కు ముందు రాజస్థాన్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సుమారు 5.47 కోట్ల మంది ఉన్నారు. ప్రత్యేక సవరణ అనంతరం ఈ సంఖ్య 5.15 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు 32 లక్షల మంది పేర్లు తొలగించారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించిన జాబితాలో మాత్రం 5.45 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దీంతో రెండు జాబితాల మధ్య సుమారు 30 లక్షల మంది వ్యత్యాసం కనిపిస్తోంది.
మృతుల పేర్లపైనా ప్రశ్నలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో సుమారు 1.8 లక్షల మంది మరణించినట్లు గుర్తించి వారి పేర్లను తొలగించినట్లు నిఖిల్ డే తెలిపారు. అయితే అదే వ్యక్తుల పేర్లు పాత జాబితాలో కొనసాగడం, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఒక జాబితాలో ఓటరు మరణించినట్లు నమోదు చేసి మరో జాబితాలో పేరు కొనసాగించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ వ్యత్యాసంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆడిట్ కోరినా అంగీకరించలేదని, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల ప్రక్రియ ముందే మొదలైంది ఎస్‌ఈసీ
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు చాలా ముందుగానే ప్రారంభమయ్యాయని, అందుకే ఎస్‌ఐఆర్‌కు ముందు ఉన్న ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తన నివేదికలో పేర్కొంది. మరోవైపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవీన్ మహాజన్.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ జాబితాను ఆధారంగా తీసుకుందని తెలిపారు. రాజస్థాన్‌లో ఎస్‌ఐఆర్ తుది జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని పేర్కొన్నారు. అయితే, ఓటర్ల జాబితాలను ఎప్పటికప్పుడు సవరించే అవకాశం ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఎస్‌ఐఆర్ అనంతరం విడుదలైన తుది జాబితానే ఉపయోగించాల్సిందని నిఖిల్ డే వాదిస్తున్నారు. ఒకే ఓటరు పేరు ఒక జాబితాలో తొలగించి, మరో జాబితాలో కొనసాగించడం వెనుక కారణాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం ఎన్నికల జాబితాల విశ్వసనీయతపై చర్చకు దారితీసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ram Gopal Varma Diwali Tweet | "చేతులు కాల్చుకునే వారికి నా విషెస్ వర్తించవు".. దీపావళి వేళ పొల్యూషన్, టపాసులపై ఆర్జీవీ ట్వీట్!
- ●Deepika Chikhli | సాయిపల్లవి యాక్షన్ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Diwali Firecracker Safety Tips | టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు మరవకండి.. కాలిన గాయాలకు టూత్‌పేస్ట్, ఐస్ పెడితే ఏమవుతుందో తెలుసా?
- ●Gadi Eizenkot | నెతన్యాహుకు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎయిజెన్కాట్కు తొలి అవకాశం
- ●Diwali Snack Ideas | దీపావళి హౌస్ పార్టీకి గెస్టులు వస్తున్నారా? గంటల తరబడి వంట వద్దు.. ఈ 3 వెరైటీ స్నాక్స్ పెడితే గెస్టులు ఫిదా!
- ●CM Revanth Reddy | మహిళా శక్తే నా శక్తి.. మీ ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది

Ram Gopal Varma Diwali Tweet | "చేతులు కాల్చుకునే వారికి నా విషెస్ వర్తించవు".. దీపావళి వేళ పొల్యూషన్, టపాసులపై ఆర్జీవీ ట్వీట్!

Deepika Chikhli | సాయిపల్లవి యాక్షన్ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు

Diwali Firecracker Safety Tips | టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు మరవకండి.. కాలిన గాయాలకు టూత్‌పేస్ట్, ఐస్ పెడితే ఏమవుతుందో తెలుసా?

Gadi Eizenkot | నెతన్యాహుకు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎయిజెన్కాట్కు తొలి అవకాశం





